KGF 28 Days Collections: 347 కోట్ల బిజినెస్.. 4 వారాల్లోనే అన్ని కోట్లు.. తెలుగులో లాభం ఎంతంటే!
అన్ని జోనర్లతో పోల్చుకుంటే మాస్ యాక్షన్ మూవీస్‌కు కొంత ఎక్కువ ఆదరణ దక్కుతూ ఉంటుంది. అందుకే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అలాంటి సినిమాలే రూపొందుతోన్నాయి. అందుకు తగ్గట్లుగానే భారీ విజయాలను కూడా సొంతం చేసుకుంటున్నాయి. అలా ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయిన చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 2'. యశ్ - ప్రశాంత్ నీల్ కాంబోలో కొన్నేళ్ల క్రితం వచ్చిన మొదటి భాగం పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అవడంతో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చారు.
ఇది కూడా ఎన్నో అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ మీద పంజా విసిరింది. దీంతో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ నాలుగు వారాల్లో ఎంత వసూలు చేసిందో మీరూ ఓ లుక్కేయండి మరి!

రాఖీ భాయ్ రీఎంట్రీతో కేజీఎఫ్ 2
రాకింగ్ స్టార్ యశ్.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందిన చిత్రమే ‘KGF Chapter 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రను పోషించారు.

‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్
క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ యాక్షన్ మూవీకి రూ. 345 కోట్ల మేర ప్రీ బిజినెస్ అయింది.

28 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
‘కేజీఎఫ్ 2' మూవీకి ఏపీ, తెలంగాణలో 28వ రోజు కలెక్షన్లు మరింత పడిపోయాయి. దీంతో నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 30 వేలు, వెస్ట్‌లో రూ. 70 వేలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 50 వేలు, నెల్లూరులో రూ. 50 వేలతో.. 28వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 11 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్ రాబట్టింది.

4 వారాలకు కలిపి ఎంతొచ్చింది
‘కేజీఎఫ్ 2'కు 4 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 42.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.85 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.85 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.63 కోట్లు, గుంటూరులో రూ. 4.84 కోట్లు, కృష్ణాలో రూ. 4.23 కోట్లు, నెల్లూరులో రూ. 2.81 కోట్లతో.. కలుపుకుని రూ. 83.36 కోట్లు షేర్, రూ. 135.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత
4 వారాల్లో ఆంధ్రా, తెలంగాణలో ‘కేజీఎఫ్ 2'కు రూ. 83.36 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 101.85 కోట్లు, తమిళనాడులో రూ. 52.30 కోట్లు, కేరళలో రూ. 30.32 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 214 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 94.85 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 28 రోజుల్లోనే రూ. 576.68 కోట్లు షేర్‌తో పాటు రూ. 1175.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.
Recommended Video


టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?
‘కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 4 వారాల్లోనే ఓవరాల్‌గా రూ. 576.68 కోట్లతో.. రూ. 229.68 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 4.36 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











