KGF 35 Days Collections: 345 కోట్లు 5 వారాల్లో వచ్చింది ఇంత.. 100 కోట్లు తేడాతో RRR రికార్డు బ్రేక్

కన్నడ చిత్ర పరిశ్రమలో రూపొంది.. దేశ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలై.. అన్ని చోట్లా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఈ ఉత్సాహంతోనే దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను రూపొందించారు. ఇది కూడా అనుకున్న రీతిలోనే ఆరంభం నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్లు కూడా దీనికి భారీగానే వచ్చాయి. దీంతో చాలా ఏరియాలతో పాటు ఓవరాల్‌గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ 5 వారాల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

కేజీఎఫ్ కోసం మళ్లీ వచ్చిన రాఖీ

కేజీఎఫ్ కోసం మళ్లీ వచ్చిన రాఖీ

కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మాస్ చిత్రమే 'KGF Chapter 2'. ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రలో నటించారు.

‘కేజీఎఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్

‘కేజీఎఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ యాక్షన్ మూవీకి రూ. 345 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

35 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

35 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు అన్ని భాషల్లో మంచి ఆదరణ దక్కింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా మొదటి నుంచే కలెక్షన్లు పొటెత్తాయి. అయితే, ఇవి క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో 35వ రోజు ఇది రూ. 2 లక్షలే వసూలు చేసింది.

5 వారాలకు కలిపి ఎంతొచ్చింది

5 వారాలకు కలిపి ఎంతొచ్చింది

'కేజీఎఫ్ 2'కు 5 వారాలకు తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 42.76 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.94 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.91 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.58 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.64 కోట్లు, గుంటూరులో రూ. 4.90 కోట్లు, కృష్ణాలో రూ. 4.27 కోట్లు, నెల్లూరులో రూ. 2.82 కోట్లతో.. కలుపుకుని రూ. 83.85 కోట్లు షేర్, రూ. 136.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత


5 వారాల్లో ఆంధ్రా, తెలంగాణలో 'కేజీఎఫ్ 2'కు రూ. 83.85 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 104.35 కోట్లు, తమిళనాడులో రూ. 54.30 కోట్లు, కేరళలో రూ. 31.95 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 220.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 98.45 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 35 రోజుల్లోనే రూ. 592.95 కోట్లు షేర్‌తో పాటు రూ. 1212.51 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?

టార్గెట్ ఎంత.. లాభాలు ఎంత?


'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు తగ్గట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు (టార్గెట్ రూ. 347 కోట్లు) మేర బిజినెస్ జరిగింది. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు (టార్గెట్ రూ. 79 కోట్లు) బిజినెస్ చేసుకుంది. ఇది 5 వారాల్లోనే ఓవరాల్‌గా రూ. 592.95 కోట్లతో.. రూ. 245.95 కోట్ల లాభాలు అందుకుంది. అలాగే, తెలుగులో రూ. 4.85 కోట్లు ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

RRR మూవీ కంటే 100 కోట్లతో

RRR మూవీ కంటే 100 కోట్లతో

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన సినిమాల్లో RRR ఒకటి. అయితే, ఈ చిత్రం 5 వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 1116.70 కోట్ల గ్రాస్‌ను రాబట్టి సత్తా చాటింది. అయితే, 'కేజీఎఫ్ చాప్టర్ 2' మాత్రం 5 వారాల్లోనే ఏకంగా రూ. 1212.51 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. తద్వారా దాని కంటే రూ. 100 కోట్లు ఎక్కువ వసూళ్లతో రికార్డు కొట్టేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X