KGF 2 Collections: తెలుగు గడ్డపై కేజీఎఫ్ ఆల్‌టైమ్ రికార్డు.. ప్రభాస్, పవన్ రికార్డులు బ్రేక్
అదిరిపోయే హీరో ఎలివేషన్ సీన్లు.. ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్.. గూస్‌బమ్స్ తెప్పించే బ్యాగ్రౌండ్ స్కోర్.. మనసును హత్తుకునే తల్లి సెంటిమెంట్.. వీటన్నింటి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీనే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. రాకింగ్ స్టార్ యశ్, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఈ ఉత్సాహంతోనే దీనికి 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట సీక్వెల్‌ను తెరకెక్కించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నైజాంలో ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

రాఖీ భాయ్ మళ్లీ వచ్చేశాడుగా
కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రమే‘KGF Chapter 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేసింది. రవీనా టాండన్ కీలక పాత్రను పోషించారు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

భారీ బిజినెస్... గ్రాండ్ రిలీజ్
ప్రకటన సమయం నుంచే ‘KGF Chapter 2' మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా అప్‌డేట్లకు భారీ స్పందన దక్కింది. ఇక, అన్ని భాషల్లో దీని హక్కులకు గట్టి పోటీ ఏర్పడింది. ఫలితంగా అన్ని ఏరియాల రైట్స్ కలిపి భారీ బిజినెస్ జరిగింది. అలాగే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా 10 వేలకు పైగా థియేటర్లలో తీసుకు వచ్చారు.

హిట్ టాక్.. పాజిటివ్ రివ్యూలు
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ‘KGF Chapter 2' గురువారమే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి స్పందనను అందుకున్న ఈ మూవీకి ఓవరాల్‌గా మంచి టాక్ వచ్చింది. అలాగే, రివ్యూలు కూడా చాలా పాజిటివ్‌గా వచ్చాయి. ఈ సినిమా ఫలితంతో అటు హీరో ఫ్యాన్స్.. ఇటు చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉందని చెప్పొచ్చు.

తెలుగులో మరింత ఎక్కువగా
పేరుకు కన్నడ సినిమానే అయినా ‘KGF Chapter 2'పై దేశ వ్యాప్తంగా భారీ బజ్ నెలకొన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అందుకే ఇది తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 కోట్ల బిజినెస్ కూడా జరుపుకుంది. ఇక, అన్ని ప్రాంతాల మాదిరిగానే మన దగ్గర కూడా ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

నైజాంలో అత్యధిక వసూళ్లతో
రాకింగ్ స్టార్ యశ్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో భారీ స్థాయిలో విడుదలైన ‘KGF Chapter 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని చోట్లా మంచి స్పందన దక్కింది. దీంతో థియేటర్లు అన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. అయితే, అన్ని ఏరియాల కంటే నైజాంలో మరింత ఎక్కవ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా అక్కడ మొదటి రోజు ఏకంగా రూ. 9.68 కోట్లు కలెక్ట్ అయ్యాయి.

పవన్, ప్రభాస్ రికార్డులు బ్రేక్
‘KGF Chapter 2' నైజాంలో మొదటి రోజు అనూహ్యంగా రూ. 9.68 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా అక్కడ ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో ఐదో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ సాహో రూ. 9.41 కోట్లు, బాహుబలి 2 రూ. 8.90 కోట్లు, వకీల్ సాబ్ రూ. 8.75 కోట్లు రికార్డును దాటేసింది. ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ రూ. 23.35 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.
Recommended Video


నైజాంలో ఆల్‌టైమ్ రికార్డుతో
‘KGF Chapter 2' నైజాం ఏరియాలో హవాను చూపిస్తూ రూ. 9.68 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇంత ఎక్కువ వసూళ్లను అందుకున్న మొట్టమొదటి డబ్బింగ్ సినిమాగా ఇది ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసుకుంది. ఈ జాబితాలో పది స్థానాల్లో మరో డబ్బింగ్ సినిమా లేదు. అంటే కేజీఎఫ్ మూవీని తెలుగు వాళ్లు ఎంతలా ఆదరించారో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











