KGF Chapter 2 Business: టాలీవుడ్‌లో సంచలన రికార్డు.. తెలుగులోనే అన్ని కోట్లు.. ఆ మూవీలకు బిగ్ షాక్

కన్నడ సినీ పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చి.. దేశ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న చిత్రం 'KGF Chapter 1'. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ ఐదు భాషల్లో విడుదలైంది. అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లలోనూ కలెక్షన్ల సునామీని సృష్టించింది.

అలాగే, పలు విభాగాల్లో జాతీయ అవార్డులను సైతం అందుకుంది. ఇంతటి ఘన విజయాన్ని దక్కించుకున్న ఈ సినిమాకు 'KGF Chapter 2' పేరిట సీక్వెల్ కూడా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో అత్యధిక బిజినెస్ జరిగింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి. ఆ వివరాలు మీకోసం!

 రెండో భాగంతో రాఖీ భాయ్ రెడీగా

రెండో భాగంతో రాఖీ భాయ్ రెడీగా

రాకింగ్ స్టార్ యశ్.. ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'KGF Chapter 1' సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే 'KGF Chapter 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో విలన్ అధీరాగా సంజయ్ దత్ నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు.

అలాంటి స్టోరీతో.. మరింత పవర్

అలాంటి స్టోరీతో.. మరింత పవర్

కేజీఎఫ్‌ను రాఖీ భాయ్ తన వశం చేసుకోవడంతో మొదటి భాగం పూర్తైంది. ఇక, ఇప్పుడు అతడిని ఎదురించేందుకు అధీరా ఎంట్రీ ఇవ్వడంతో 'KGF Chapter 2' కథ మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య పోరాటం జరిగే తీరుతోనే సినిమా రూపొందింది. ఇక, ఇందులో అధీరాగా సంజయ్ దత్ నటించారు. ఈ భాగంలో రాఖీ భాయ్ పాత్రను మరింత ఎలివేట్ చేస్తున్నారట.

వాయిదాలు.. ఫిక్సైన రిలీజ్ డేట్

వాయిదాలు.. ఫిక్సైన రిలీజ్ డేట్

భారీ బడ్జెట్‌తో రూపొందిన 'KGF Chapter 2' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ప్రేక్షఖుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ అనుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు డేట్లను కూడా ప్రకటించారు. కానీ, షూటింగ్ ఆలస్యం అయిన కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఈ సినిమాను ఏప్రిల్ 14న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నారు.

భారీ బజ్.. అత్యధిక బిజినెస్‌తో

భారీ బజ్.. అత్యధిక బిజినెస్‌తో

'KGF Chapter 2'పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకే ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ సినిమా అన్ని భాషల్లో హక్కులకు తీవ్ర పోటీ ఏర్పడింది. ఫలితంగా అన్ని ఏరియాల రైట్స్ కలిపి భారీ ధరకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అలాగే రిలీజ్ కూడా గ్రాండ్‌గా చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఇలా

తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఇలా

'KGF Chapter 2' మూవీకి తెలుగులోనూ భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. నైజాంలో రూ. 25 కోట్లు, సీడెడ్‌లో రూ. 14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10 కోట్లు, ఈస్ట్‌లో రూ. 7 కోట్లు, వెస్ట్‌లో రూ. 6 కోట్లు, గుంటూరులో రూ. 7 కోట్లు, కృష్ణాలో రూ. 6 కోట్లు, నెల్లూరులో రూ. 3 కోట్లతో.. ఆంధ్రా, తెలంగాణలో కలిపి మొత్తంగా రూ. 78 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే

రాకింగ్ స్టార్ యశ్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన 'KGF Chapter 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 79 కోట్లు వస్తేనే ఈ సినిమా తెలుగులో విజయం సాధిస్తుంది. దీనికి ఉన్న బజ్‌ నేపథ్యంలో దీనికి మంచి టాక్ వస్తే ఈ కలెక్షన్లు వీలైనంత త్వరగానే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

టాలీవుడ్‌లో కేజీఎఫ్ సంచలనం

టాలీవుడ్‌లో కేజీఎఫ్ సంచలనం

తెలుగులోకి డబ్ అయిన సినిమాల్లో ఎక్కువ బిజినెస్ చేసుకున్న చిత్రాల జాబితాలో 'KGF Chapter 2' రూ. 78 కోట్లతో సంచలనం సృష్టించింది. తద్వారా 'రోబో 2.0' పేరిట ఉన్న రూ. 71 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. ఇక, ఈ జాబితాలో 'ఐ' రూ. 39 కోట్లు, 'కాలా' రూ. 33 కోట్లు, 'కబాలి' రూ. 31 కోట్లు, 'రోబో' రూ. 27 కోట్లు, 'సింగం 3' రూ. 20 కోట్లతో తర్వాత ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X