రికార్డు ధరకు కేజీఎఫ్2 శాటిలైట్ హక్కులు.. దక్షిణాదిలో బిగ్గెస్ట్ బిజినెస్

కరోనా లాక్‌డౌన్ తర్వాత కేజీఫ్: చాప్టర్ 2 పనులు వేగం పుంజుకొన్నాయి. సినిమాలకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని కన్నడ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత పోస్టు ప్రొడక్షన్ పనుల్లో సాంకేతిక నిపుణులు బిజీగా మారిపోయారు. ఇప్పటికే రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటడంతో కేజీఎఫ్ టీమ్ తమ పనులను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ వార్తల మధ్య ఈ సినిమా శాటిలైట్ హక్కుల బిజినెస్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివారాల్లోకి వెళితే..

Recommended Video

KGF Chapter 2 Satellite Rights Sold for Record Price 120Cr
బిజీగా పోస్టు ప్రొడక్షన్ పనులు

బిజీగా పోస్టు ప్రొడక్షన్ పనులు

హోమబుల్ ఫిల్మ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ట్వీట్ చేసిన ప్రకారం.. దర్శకుడు ప్రశాంత్ నీల్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ స్టూడియోలో పోస్టు ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉణ్నారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన షూటింగ్‌కు సంబంధించిన పోర్షన్‌కు సంబంధించిన రీరికార్డింగ్, డబ్బింగ్ పనులను పూర్తి చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

కొవిడ్ నిబంధనలు అనుగుణంగా

కొవిడ్ నిబంధనలు అనుగుణంగా

కేజీఎఫ్: చాఫ్టర్ 2 మ్యూజిక్ సెషన్స్‌లో ఉన్నామని కార్తీక్ గౌడ్ ట్వీట్ చేశారు. తాము కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి, శానిటైజన్ పాటిస్తూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకొంటున్నాం అని పేర్కొన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ దూరంగా కూర్చొని మ్యూజిక్ చర్చల్లో పాల్గొన్నారు. ప్రతీ రోజు స్టూడియోను శానిటైజ్ చేయాలని సిబ్బందికి సూచించామని పేర్కొన్నారు.

రికార్డు ధరకు శాటిలైట్ హక్కులు

రికార్డు ధరకు శాటిలైట్ హక్కులు

ఇక కన్నడ పరిశ్రమలో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా బిజినెస్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించిన శాటిలైట్ హక్కులు రూ.120 కోట్లకు అమ్ముడుపోయాయనే వార్త హైలెట్ అవుతున్నది. అయితే ఈ వార్తపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.

ప్యాన్ ఇండియా మూవీగా

ప్యాన్ ఇండియా మూవీగా

కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా భారీ విజయం తర్వాత ప్రస్తుతం చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటంతో బాలీవుడ్ ప్రముఖులను ఎంపిక చేశారు. రవీనా టాండన్, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, తెలుగు విలక్షణ నటుడు రావు రమేష్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 23 తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X