RRRను క్రాస్ చేసిన KGF2.. ఏకంగా రెట్టింపు అమ్మకాలతో నార్త్ లో నెం.1.. నార్త్ సినిమాలన్నీ చిత్తే!

కరోనా పరిస్థితి కాస్త కుదుట పడడంతో తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన RRR సినిమా విడుదలయి అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా కలెక్షన్లు సాధించే దిశగా ముందుకు వెడుతోంది. అయితే ఇప్పుడు తెలుగు భాషలోనే కాదు ఇతర భాషలలో కూడా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమాలు విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

అందులో భాగంగా కన్నడ సినీ పరిశ్రమ నుంచి తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా KGF చాప్టర్ 2. ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమా హిందీలో అడ్వాన్స్ బుకింగ్ రికార్డులను బద్దలు కొట్టి, మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే దిశగా ముందుకు వెళుతుంది. ఆ వివరాల్లోకి వెళితే

RRR

RRR

తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సినిమాలో చాటిచెప్పిన రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో ఒక సినిమా తెరకెక్కించారు. రణం రౌద్రం రుధిరం పేరుతో తెరకెక్కిన సినిమా RRRగా బాగా ప్రాచుర్యం పొందింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించగా ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ ఒలీవియా మోరిస్ నటించింది. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రేయ, సముద్రఖని వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు

ట్రేడ్ వర్గాలు అంచనా

ట్రేడ్ వర్గాలు అంచనా

కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబో KGF చాప్టర్ 2 కోసం పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ అడ్వాన్స్ బుకింగ్ కోసం ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం బుక్ మై షోలో 1 .5 మిలియన్ ప్లస్ మెంబర్స్ ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్టేడ్ అని క్లిక్ చేశారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఒక్క హిందీ వెర్షన్ లో మాత్రం ఫస్ట్ డే ఓపెనింగ్ 20 కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా కొచ్చాయి. సౌత్ ఇండియన్ సినిమాల్లోనే బాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ తో రికార్డు సెట్ చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు.

ఏప్రిల్ 7న

ఏప్రిల్ 7న

రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన సినిమా 'కేజీఎఫ్: చాప్టర్-2' పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కింది. యష్ ఈ మూవీలో రాఖీ భాయ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. సంజయ్ దత్ విలన్ అధీరా పాత్రలో నటించనున్నారు. ఇక రవీనా టండన్ ప్రధానమంత్రి పాత్ర పోషిస్తుంది.

బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన 'కేజీఎఫ్: చాప్టర్-1'కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7న హిందీకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో థియేటర్లల్లో టిక్కెట్ల బుకింగ్‌ ప్రారంభమైంది.

ఎగబడి

ఎగబడి

అలా 'కేజీఎఫ్-2' హిందీ వెర్షన్ టిక్కెట్‌లు అమ్మడం మొదలు పెట్టగానే ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎగబడి టికెట్లు కొనేశారు. 12 గంటల్లోనే దాదాపు లక్ష టిక్కెట్లు బుక్ అయ్యాయని అంటే సినిమా మీద క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన మొదటి రోజే దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేసి సత్తా చాటుకుంది ఈ సినిమా.

ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా పూణే, సూరత్, అహ్మదాబాద్, కోల్‌కత్తా, జైపూర్, లక్నో మొదలైన ప్రాంతాల్లో రూ.10 లక్షల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఒక్క ముంబైలో మొదటి రోజు రూ.75 లక్షల వసూళ్లను రాబట్టింది.

 బుధవారం నాటికి

బుధవారం నాటికి

ఇంకా భారత్‌లోని అన్ని ప్రాంతాల్లో టిక్కెట్ బుకింగ్‌లను ప్రారంభించలేదని, ఒక వేళ అన్ని చోట్ల బుకింగ్‌లు ప్రారంభమైతే ఈ కలెక్షన్స్ మరింత అధికమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక మూడు రోజుల పాటు ఉన్న అద్వాన్స్ బుకింగ్స్ పరిశీలీసైతే ఏకంగా 14 కోట్లు కలెక్ట్ చేసినట్టు ఆచెబుతున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్' కేవలం రూ. 7 కోట్లను మాత్రమే అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా సంపాదించింది. కానీ కేజీఎఫ్-2' సినిమా మొదటి రోజు రూ.3 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి ప్రస్తుతానికి 14 కోట్ల వద్ద నడుస్తోంది. ఇక బుధవారం నాటికి బుకింగ్‌ల ద్వారా రూ. 15 నుంచి 17 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనాలున్నాయి.

Recommended Video

RRR Movie నాలుగో రోజూ రికార్డ్ కలెక్షన్స్.. సోమవారం సెంటిమెంట్ బ్రేక్ | Filmibeat Telugu
బ్రేక్ చేస్తుందో లేదో

బ్రేక్ చేస్తుందో లేదో

'కేజీఎఫ్-1' ను కూడా నార్త్ ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. అలా మొదటి భాగాన్ని చూసినవారు రెండో దానిని తప్పక చూడాలనుకుంటున్నారు. మొదటి రోజు ఈ చిత్రం దాదాపు రూ. 20 కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతుందని బాలీవుడ్ ట్రేడ్ ఎక్స్‌ఫర్ట్స్ చెబుతున్నారు. ఆ సంఖ్య 50 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

అన్నట్టు ఆర్ఆర్ఆర్ హిందీలో తొలిరోజు 19 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించగా కేజీఎఫ్2 ఆ సినిమాకు రెట్టింపు కలెక్షన్లను సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. మరి నార్త్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి2, RRR క్రియేట్ చేసిన రికార్డులను కేజీఎఫ్2 బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. అన్నట్టు ఇప్పటిదాకా నార్త్ లో 2022 భారీ అడ్వాన్స్ బుకింగ్ రికార్డు RRR పేరిట 7 కోట్లు ఉండగా దాన్ని ఈ సినిమా దాటింది. మూడవ స్థానంలో గంగూభాయి 4కోట్లు, నాలుగో స్థానంలో బచ్చన్ పాండే నిలబడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X