కేజీఎఫ్ సరికొత్త రికార్డులు.. బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న యష్

కన్నడ సంచలన చిత్రం కేజీఎఫ్ అరుదైన రికార్డులతో దూసుకెళ్తున్నది. రాకింగ్ స్టార్ యష్ నటించిన ఈ చిత్రం 16వ రోజున కూడా భారీ వసూళ్లను సాధిస్తున్నది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. హిందీ, తమిళ, ఇతర భాషల్లో భారీ చిత్రాలు రిలీజైనప్పటికీ నిలకడగా వసూళ్లు సాధించడం సినిమా స్టామినాను తెలియజెప్పింది. ప్రపంచవ్యాప్తంగా 16 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

రూ.200 కోట్ల క్లబ్‌లోకి

రూ.200 కోట్ల క్లబ్‌లోకి

కన్నడ చిత్ర పరిశ్రమలో కేజీఎఫ్ సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు సాధించిన తొలి కన్నడ చిత్రంగా ఘనతను సాధించింది. 16 రోజున రూ.214 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పటి వరకు ఈ రేంజ్‌లో ఏ కన్నడ చిత్రం కలెక్షన్లు లేకపోవడం గమనార్హం. ఈ చిత్రం రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది.

కన్నడలో రూ. 100 కోట్లు

కన్నడలో రూ. 100 కోట్లు

కన్నడలో కేజీఎఫ్ చిత్రం మరో రికార్డును సొంతం చేసుకొన్నది. కన్నడ పరిశ్రమలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఓవరాల్‌గా ఈ చిత్రం 117 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దక్షిణాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో చిత్రంగా కేజీఎఫ్ నిలిచింది. బాహబలి, 2.0 చిత్రం ముందు వరుసలో ఉన్నాయి.

హిందీలో రూ.40 కోట్లు

హిందీలో రూ.40 కోట్లు

హిందీలో భారీగా వసూళ్లను సాధిస్తూ రూ.40 కోట్లకు చేరువైంది. హిందీ వెర్షన్ ఇంకా సుమారు 1000 థియేటర్లలో ప్రదర్శింపబడతుండటం గమనార్హం. ముంబైలో కేజీఎఫ్ సినిమా కలెక్షన్ల బ్రహ్మండంగా ఉన్నాయి. వచ్చేవారం కూడా మరంచి వసూళ్లు రాబట్టే అవకాశం లేకపోలేదు అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

తెలుగు, తమిళ, కేరళ రాష్ట్రాల్లో

తెలుగు, తమిళ, కేరళ రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. తెలంగాణ, ఆంధ్రలో రూ.20.80 కోట్లు, తమిళనాడులో రూ.8.35 కోట్లు, కేరళలో రూ.2.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.6 కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఈ వారం భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కేజీఎఫ్ కలెక్షన్లు క్షీణించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X