కేజీఎఫ్ కలెక్షన్లు: బాహుబలి తర్వాత కేజీఎఫ్.. అరుదైన రికార్డు దిశగా యష్ మూవీ!
Recommended Video

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తున్నది. గత 12 రోజుల్లో ఈ చిత్రం రూ.150 కోట్ల మైలురాయిని సునాయసంగా దాటింది. అంతేకాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ చిత్రాలకు ధీటుగా కలెక్షన్లు సాధిస్తున్నది. గత 12 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే

బాహుబలి తర్వాత కేజీఎఫ్
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమా తర్వాత దక్షిణాది సినీ పరిశ్రమ ఖ్యాతిని కేజీఎఫ్ చిత్రం ప్రపంచపటం పెట్టింది. భారతీయ సినిమా ఓ అరుదైన మైలురాయిగా నిలిచింది. అలాగే విడుదలైన ప్రతీ చోట పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. తొలుత కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ దానిని పాజిటివ్‌గా మార్చుకోలిగింది.

మిలియన్ క్లబ్ వైపు దిశగా కేజీఎఫ్
అమెరికాలో కేజీఎఫ్ చిత్రం 125 లోకేషన్లలో విడుదలైంది. ఈ చిత్రం 7 లక్షల డాలర్లను అధిగమించింది. అంతేకాకుండా ఈ చిత్రం మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది. 11వ రోజు నాటికి ఈ చిత్రం 681,023 డాలర్లు రాబట్టింది.

కర్ణాటకలో రూ.100 కోట్ల క్లబ్‌లోకి
కర్ణాటక రాష్ట్రంలో కేజీఎఫ్ రూ.100 కోట్ల వసూళ్ల దిశగా పరుగులు పెడుతున్నది. డిసెంబర్ 21న రిలీజైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.90.5 కోట్లు రాబట్టింది. ఇంకా ఈ చిత్రానికి కేజీఎఫ్‌కు మంచి స్పందన లభిస్తున్నది.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా
ఇక దక్షిణాదిలో కేజీఎఫ్ సినిమా భారీ వసూళ్లను సాధిస్తున్నది. గత పది రోజుల్లో కేరళలో రూ.1.65 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఇప్పటి వరకు తొలివారం షేర్ రూ. 5.5 కోట్లకుపైగా, గ్రాస్ రూ.10.5 కోట్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నైజాంలో రూ.2 కోట్లు, సీడెడ్‌లో కోటి రూపాయాలకు పైగా రాబట్టింది.

కేజీఎఫ్ రూ.200 కోట్ల దిశగా
దర్శకుడు ప్రశాంత్ నీల్ సుమారు రూ.80 కోట్లతో కేజీఎఫ్ రూపొందింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్లు సాధించింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం సుమారు రూ.200 కోట్ల గ్రాస్ సాధించే అవకాశం ఉందనే మాటను ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











