For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్ రిపోర్ట్: ‘జీరో’కు ‘కెజిఎఫ్’ స్ట్రోక్ ... ఐదో రోజు అమాంతం పెరిగిన కలెక్షన్స్!

    |
    #KGF 5 days Worldwide Box Office Collections

    షారుక్ ఖాన్ నటించిన 'జీరో'కు సౌత్ డబ్బింగ్ చిత్రం 'కెజిఎఫ్' హిందీ బాక్సాఫీసు వద్ద గట్టిపోటీ ఇస్తోంది. 'జీరో' వసూళ్లు రోజు రోజుకు తగ్గుతుండగా.... 'కెజిఎఫ్' గ్రోత్ రోజు రోజుకు పెరుగుతోంది. ఐదో రోజైన మంగళవారం యష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ వసూళ్లు అమాంతం పెరిగిపోయాయి.

    షారుక్ ఖాన్ ఇమేజ్‌కు తగిన విధంగా 'జీరో' చిత్రాన్ని 4,380 స్క్రీన్లలో భారీగా విడుదల చేశారు. సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. అయితే ఓపెనింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీనికి తోడు తొలి రోజే మిక్డ్స్ మౌత్ టాక్ రావడంతో సినిమా అంచనాలను అందుకోలేక పోయింది.

    అంత సీన్ లేదని తేలిపోయింది

    అంత సీన్ లేదని తేలిపోయింది

    ‘జీరో' చిత్రం బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందనే అందరి అంచనాలు తలక్రిందులయ్యాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం లేదని తేలిపోయింది. అయితే హిట్టా? ప్లాపా? అనేది వచ్చే 10 రోజుల్లో కలెక్షన్స్ బట్టి డిసైడ్ అవుతుంది.

     క్రిస్మస్ పండగ కాస్త కలిసొచ్చింది

    క్రిస్మస్ పండగ కాస్త కలిసొచ్చింది

    ‘జీరో' చిత్రానికి క్రిస్మస్ హాలిడే కాస్త కలిసొచ్చింది. సెలవు రోజు కావడంతో మంగళవారం అయినప్పటికీ రూ. 12.75 కోట్లు వసూలు చేసింది. దీంతో 5 రోజుల ఇండియా బిజినెస్ రూ. 81.32 కోట్లకు చేరుకుంది.

     జీరో ఐదు రోజుల వసూళ్లు ఇలా...

    జీరో ఐదు రోజుల వసూళ్లు ఇలా...

    ‘జీరో' చిత్రం ఐదు రోజుల వసూళ్లు పరిశీలిస్తే.... ఓపెనింగ్ డే అయిన శుక్రవారం రూ. 20.14 కోట్లు, శనివారం రూ. 18.22 కోట్లు, ఆదివారం రూ. 20.71 కోట్లు, సోమవారం రూ. 9.50 కోట్లు, మంగళవారం రూ. 12.75 కోట్లు... మొత్తం రూ. 81.32 కోట్లు రాబట్టింది.

     ఐదో రోజు అమాంతం పెరిగిన ‘కెజిఎఫ్' కలెక్షన్స్

    ఐదో రోజు అమాంతం పెరిగిన ‘కెజిఎఫ్' కలెక్షన్స్

    ‘కెజిఎఫ్' హిందీ వెర్షన్ బిజినెస్ క్రిస్మస్(5వ రోజు) సందర్భంగా కలిసొచ్చింది. తొలి 4 రోజుల కంటే ఎక్కువగా 5వ రోజు వసూలు కావడం విశేషం. దీంతో మొత్తం కలెక్షన్ రూ. 16.45 కోట్లకు చేరుకుంది. హిందీలో ఈ చిత్రం దాదాపు 1500 స్క్రీన్లలో విడుదలైంది.

    కెజిఎఫ్ 5 డేస్ కలెక్షన్ ఇలా...

    కెజిఎఫ్ 5 డేస్ కలెక్షన్ ఇలా...

    కెజిఎఫ్ హిందీ వెర్షన్ మొదటి రోజైన శుక్రవారం రూ. 2.10 కోట్లు, శనివారం రూ. 3 కోట్లు, ఆదివారం రూ. 4.10 కోట్లు, సోమవారం రూ. 2.80 కోట్లు, మంగళవారం రూ. 4.35 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తం హిందీ వెర్షన్ బిజినెస్ రూ. 16.45 కోట్లకు చేరుకుంది.

    వరల్డ్ వైడ్ బిజినెస్‌లో కెజిఎఫ్ టాప్

    వరల్డ్ వైడ్ బిజినెస్‌లో కెజిఎఫ్ టాప్

    అయితే కన్నడ, తెలుగు, తమిళం, హిందీ అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ బిజినెస్ పరిశీలిస్తే ‘కెజిఎఫ్' చిత్రం ‘జీరో' కంటే ముందు ఉంది. కన్నడలో రూ. 62 కోట్లు, తెలుగులో రూ. 7.30 కోట్లు, కేరళలో రూ. 1.60 కోట్లు, తమిళనాడులో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 22. కోట్లు, ఓవర్సీస్ రూ. 4.50 కోటుల రాబట్టి... రూ. 100 కోట్ల మార్కును అధిగమించింది.

    English summary
    Zero and KGF shown good spoke in their collection at the Indian box office, but the growth of Yash is a notch higher than that of Shah Rukh Khan's film. Zero five-day total to Rs 81.32 crore net. Kolar Gold Fields' (KGF) starring Yash Rocking at Box-office. "KGF" Continuing Its Dream run at Box-office And Crossed 100Crs Gross At worldwide just in 5days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X