Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాక్సాఫీస్ రిపోర్ట్: ‘జీరో’కు ‘కెజిఎఫ్’ స్ట్రోక్ ... ఐదో రోజు అమాంతం పెరిగిన కలెక్షన్స్!
Recommended Video
షారుక్ ఖాన్ నటించిన 'జీరో'కు సౌత్ డబ్బింగ్ చిత్రం 'కెజిఎఫ్' హిందీ బాక్సాఫీసు వద్ద గట్టిపోటీ ఇస్తోంది. 'జీరో' వసూళ్లు రోజు రోజుకు తగ్గుతుండగా.... 'కెజిఎఫ్' గ్రోత్ రోజు రోజుకు పెరుగుతోంది. ఐదో రోజైన మంగళవారం యష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ వసూళ్లు అమాంతం పెరిగిపోయాయి.
షారుక్ ఖాన్ ఇమేజ్‌కు తగిన విధంగా 'జీరో' చిత్రాన్ని 4,380 స్క్రీన్లలో భారీగా విడుదల చేశారు. సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. అయితే ఓపెనింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీనికి తోడు తొలి రోజే మిక్డ్స్ మౌత్ టాక్ రావడంతో సినిమా అంచనాలను అందుకోలేక పోయింది.
అంత సీన్ లేదని తేలిపోయింది
‘జీరో' చిత్రం బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేస్తుందనే అందరి అంచనాలు తలక్రిందులయ్యాయి. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం లేదని తేలిపోయింది. అయితే హిట్టా? ప్లాపా? అనేది వచ్చే 10 రోజుల్లో కలెక్షన్స్ బట్టి డిసైడ్ అవుతుంది.
క్రిస్మస్ పండగ కాస్త కలిసొచ్చింది
‘జీరో' చిత్రానికి క్రిస్మస్ హాలిడే కాస్త కలిసొచ్చింది. సెలవు రోజు కావడంతో మంగళవారం అయినప్పటికీ రూ. 12.75 కోట్లు వసూలు చేసింది. దీంతో 5 రోజుల ఇండియా బిజినెస్ రూ. 81.32 కోట్లకు చేరుకుంది.
జీరో ఐదు రోజుల వసూళ్లు ఇలా...
‘జీరో' చిత్రం ఐదు రోజుల వసూళ్లు పరిశీలిస్తే.... ఓపెనింగ్ డే అయిన శుక్రవారం రూ. 20.14 కోట్లు, శనివారం రూ. 18.22 కోట్లు, ఆదివారం రూ. 20.71 కోట్లు, సోమవారం రూ. 9.50 కోట్లు, మంగళవారం రూ. 12.75 కోట్లు... మొత్తం రూ. 81.32 కోట్లు రాబట్టింది.
ఐదో రోజు అమాంతం పెరిగిన ‘కెజిఎఫ్' కలెక్షన్స్
‘కెజిఎఫ్' హిందీ వెర్షన్ బిజినెస్ క్రిస్మస్(5వ రోజు) సందర్భంగా కలిసొచ్చింది. తొలి 4 రోజుల కంటే ఎక్కువగా 5వ రోజు వసూలు కావడం విశేషం. దీంతో మొత్తం కలెక్షన్ రూ. 16.45 కోట్లకు చేరుకుంది. హిందీలో ఈ చిత్రం దాదాపు 1500 స్క్రీన్లలో విడుదలైంది.
కెజిఎఫ్ 5 డేస్ కలెక్షన్ ఇలా...
కెజిఎఫ్ హిందీ వెర్షన్ మొదటి రోజైన శుక్రవారం రూ. 2.10 కోట్లు, శనివారం రూ. 3 కోట్లు, ఆదివారం రూ. 4.10 కోట్లు, సోమవారం రూ. 2.80 కోట్లు, మంగళవారం రూ. 4.35 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తం హిందీ వెర్షన్ బిజినెస్ రూ. 16.45 కోట్లకు చేరుకుంది.
వరల్డ్ వైడ్ బిజినెస్‌లో కెజిఎఫ్ టాప్
అయితే కన్నడ, తెలుగు, తమిళం, హిందీ అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ బిజినెస్ పరిశీలిస్తే ‘కెజిఎఫ్' చిత్రం ‘జీరో' కంటే ముందు ఉంది. కన్నడలో రూ. 62 కోట్లు, తెలుగులో రూ. 7.30 కోట్లు, కేరళలో రూ. 1.60 కోట్లు, తమిళనాడులో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 22. కోట్లు, ఓవర్సీస్ రూ. 4.50 కోటుల రాబట్టి... రూ. 100 కోట్ల మార్కును అధిగమించింది.