KGF Chapter 2: రిలీజ్ కు ముందే కేజీఎఫ్ సంచలన రికార్డు.. నాన్ RRR రికార్డులు బద్దలు!

ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'KGF Chapter 1'. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో అప్పటికి కేవలం ఒక సినిమా చేసిన అనుభవం ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'KGF Chapter 1 పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. ఈ సినిమా అందరికీ నచ్చడంతో సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమాకు 'KGF Chapter 2' పేరిట ఒక సీక్వెల్‌ను రూపొందించారు. అయితే ఎప్పుడో షూటింగ్ మొదలైన ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ మూవీ ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే మీకోసం!

భారీ తారాగణం

భారీ తారాగణం

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం 'KGF Chapter 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించింది. మొదటి భాగం కంటే ఈ రెండో భాగాన్ని అన్ని బాషల ప్రేక్షకులు ఆదరించాలని ఈ సినిమాలో విలన్ అధీరాగా సంజయ్ దత్ ను నటింప చేశారు. రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. 19 ఏళ్ళ కుర్రాడు ఎడిటర్ గా పని చేశారు.

వాయిదా పడి

వాయిదా పడి

ఇక 2018లోనే 'KGF Chapter 1 విడుదలై సూపర్ హిట్ కాగా అప్పుడే 'KGF Chapter 2' చేస్తామని ప్రకటించారు. మొదలుపెట్టి సగంలో ఉండగా కరోనా రావడంతో ఈ సినిమా కూడా చాలా లేట్ అయింది. టాలీవుడ్ లోని బడా చిత్రాలలాగానే ఈ సినిమాకు కూడా పలు రిలీజ్ డేట్లను కూడా ప్రకటించారు. కానీ, షూటింగ్ ఆలస్యం అయిన కారణంగా కొన్నిసార్లు, కరోనా వేవ్స్ కారణంగా కొన్ని సార్లు వాయిదా పడింది.

 తీవ్ర పోటీ

తీవ్ర పోటీ

అలా అనేక కారణాలతో వాయిదాపడిన ఈ సినిమాను ఏప్రిల్ 14న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు.తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ బాషలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పది వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా అన్ని భాషల్లో హక్కులకు తీవ్ర పోటీ ఏర్పడింది.

భారీ రెస్పాన్స్

భారీ రెస్పాన్స్

ఫలితంగా అన్ని ఏరియాల రైట్స్ కలిపి భారీ ధరకు అమ్ముడు పోయాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 'KGF Chapter 2' మూవీకి రూ. 78 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి 'KGF Chapter 2' టికెట్ బుకింగ్స్ మంగళవారం రాత్రి నుంచే ప్రారంభం అయ్యాయి. ఇక, ఈ సినిమాకు హైదరాబాద్ నగరంలో భారీ రెస్పాన్స్ వస్తోంది.

రికార్డు

రికార్డు

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 'KGF Chapter 2' మూవీ హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అప్పుడే రూ. 6.2 కోట్లకు పైగా గ్రాస్ కూడా వసూలు అయిపోయింది. ఇక నాన్ RRR సినిమాల జాబితాలో ఈ సినిమా మొదటి స్థానం సంపాదించింది. ఇక 40+ లక్షల అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లు కేవలం బుక్ మై షో, అలాగే పేటీఎం ద్వారా అమ్ముడయ్యాయని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X