twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGFChapter 2 ప్రీ రిలీజ్ బిజినెస్.. RRR మూవీ రికార్డును బ్రేక్ చేసిన యష్

    |

    కేజీఎఫ్ ఛాప్టర్ 1 చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకొన్నది. అప్పటి వరకు సాధారణ హీరోగా ఉన్న యష్ ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోగా మారిపోయాడు. కేజీఎఫ్ 1 చిత్రం తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్, యష్‌కు విశేషమైన పాపులారిటీ లభించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

    గ్రీస్ దేశంలో తొలి దక్షిణాది మూవీ రిలీజ్

    గ్రీస్ దేశంలో తొలి దక్షిణాది మూవీ రిలీజ్

    కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం రిలీజ్‌కు ముందే పలు రకాల రికార్డులతో ముందుకెళ్తున్నది. గ్రీస్ దేశంలో రిలీజ్ అవుతున్న తొలి దక్షిణాది చిత్రంగా కేజీఎఫ్ 2 చిత్రం ఘనతను సాధించింది. ఇక అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో రిలీజ్ కావడమే కాకుండా.. అత్యధిక స్క్రీన్లలో ప్రదర్శించే చిత్రంగా రికార్డుకు చేరువ అవుతున్నది.

    కర్ణాటకలో అత్యధికంగా బిజినెస్

    కర్ణాటకలో అత్యధికంగా బిజినెస్

    యష్ సొంత రాష్ట్రమైన కర్ణాటకలో అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది. కర్ణాటకలో ఈ సినిమా బిజినెస్ 180 కోట్లు మేర జరిగింది. యష్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ప్రీ రిలీజ్ బిజినెస్ కావడం గమనార్హం. ఇప్పటికే కన్నడలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ముందు భారీ బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    అంధ్రా, తెలంగాణలో

    అంధ్రా, తెలంగాణలో

    కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీకి సంబంధించి నైజాం, ఆంధ్రలో కూడా అంచనాలకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 100 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది. తమిళనాడులో 40 కోట్ల మేర బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది.

     హిందీ, ఓవర్సీస్‌లో థియేట్రికల్ హక్కులు

    హిందీ, ఓవర్సీస్‌లో థియేట్రికల్ హక్కులు

    కేజీఎఫ్ చాఫ్టర్ 2లో హిందీ వెర్షన్‌కు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రం హిందీలో అంచనాలు లేకుండా రిలీజై రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. లాక్‌డౌన్ కారణంగా కొంత దెబ్బ పడినా హిందీ ట్రేడ్ అనలిస్టులు అంచనాలు సునాయసంగా అధిగమించింది. ఉత్తరాది థియేట్రికల్ హక్కులు 100 కోట్లు నమోదు చేసింది. అలాగే ఓవర్సీస్‌లో 75 కోట్ల మేర బిజినెస్ చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్

    కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రీరిలీజ్ బిజినెస్ విషయంలో RRR మూవీ బిజినెస్‌ను బ్రేక్ చేసింది. RRR సినిమా సుమారు 470 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసింది. అయితే KGFచాప్టర్ 2 విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 550 కోట్ల మేర బిజినెస్ చేసింది. కేజీఎఫ్ 2 చిత్రం సరికొత్త రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్దమైంది.

    English summary
    Rock Star Yash's KGFChapter 2 has done fantastic Worldwide pre release business. Reports revealed that, This movie has done nearly 550 crores busines worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X