Khaleja 4K Overseas Collections: ఓవర్సీస్‌లో చరిత్ర సృష్టించిన ఖలేజా.. నార్త్ అమెరికాలో మహేష్ మూవీకి రికార్డు
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఖలేజా. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాశ్ రాజ్, సునీల్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు కీలక పాత్రలో నటించారు. కనకరత్న మూవీస్ బ్యానర్‌పై శింగనమల రమేశ్ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు సీ కల్యాణ్, ఎస్ సత్య రామమూర్తి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఫస్ట్ టైమ్ రిలీజ్ సమయంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ తాజాగా రీ రీలీజ్ సందర్భంగా ఈ మూవీ ఓవర్సీస్ మార్కెట్‌లో రికార్డులు తిరగరాస్తున్నది. నార్త్ అమెరికాలో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు, అలాగే 2వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..
ఖలేజా ఈ మూవీని సుమారుగా 32 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 40 కోట్ల రూపాయలు మేర జరిగింది. కానీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో లైఫ్ టైమ్ థియేట్రికల్ రన్‌లో కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా సుమారుగా 22 కోట్ల రూపాయల నష్టంతో బాక్సాఫీస్ జర్నీని ముగించింది.
ఖలేజా4k చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే.. కొత్త సినిమాల రిలీజ్‌ల కంటే ఎక్కువగా వసూళ్లను సాధించింది. అయితే ఈ కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుకొంటూ వెళ్లాయే తప్ప.. ఎక్కడా స్లో కాలేదు. ఫలితంగా రి రిలీజ్ సినిమాల్లో హయ్యెస్ట్ వసూళ్లు సాధించింది అని నార్త్ అమెరికాలో ఈ సినిమాను రిలీజ్ చేసిన ప్రత్యాంగిరా సినిమాస్ వెల్లడించింది. ఇప్పటి వరకు అత్యధికంగా వసూళ్లు చేసిన సినిమాగా ఖలేజా రికార్డు క్రియేట్ చేస్తూ 100K డాలర్లు వసూలు చేసింది అని అధికారికంగా వెల్లడించారు.

ఖలేజా సినిమా కలెక్షన్ల గురించి ట్వీట్ చేస్తూ.. అవును. ఖలేజా ఫస్ట్ ఎవర్ రీ రిలీజ్ సినిమాగా 100K కలెక్షన్లు సాధించింది. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రి రీలీజ్, ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్, 100K + గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి సినిమా. లవ్ యూ సూపర్ స్టార్. లవ్ యూ సూపర్ స్టరా్ ఫ్యాన్స్. ఇది మా విజయం అని ప్రత్యాంగిరా సినిమాస్ ట్వీట్‌లో పేర్కొన్నది.
ఇక ఖలేజా4K సినిమా నార్త్ అమెరికాలో గత మూడు రోజులుగా వసూళ్లు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 58K డాలర్లు, 40k డాలర్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు అమెరికా కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటల వరకు 8K డాలర్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో 106K + డాలర్లు వసూలు చేసింది. అమెరికాలో రీ రిలీజ్ సినిమాల్లో 100K దాటిన తొలి సినిమా ఖలేజా అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, యూకేలో 15K డాలర్లు (11K పౌండ్స్0, ఆస్ట్రేలియాలో 9K డాలర్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో వివరాలు అందిన ప్రకారం.. 125K డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 1.06 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల సమాచారం.
అమెరికాలో ఖలేజా సినిమా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు భారీ పరాజయం పొందింది. బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు సినిమా బోల్తా కొట్టింది. ఈ సినిమా థియేట్రికల్ టోటల్ రన్‌లో 504K డాలర్లు అంటే.. ప్రస్తుతం 4 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ఇప్పటికే 1 కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. రానున్న రోజుల్లో ఎంత వసూలు చేస్తుందనే విషయంపై ట్రేడ్ వర్గాలు దృష్టిపెట్టాయి.


Click it and Unblock the Notifications











