Khaleja Re Release Collections: ఖలేజా రీ రిలీజ్‌కు దిమ్మతిరిగే కలెక్షన్లు.. మహేష్ మూవీకి ఎన్ని కోట్లంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఖలేజా. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాశ్ రాజ్, సునీల్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు కీలక పాత్రలో నటించారు. కనకరత్న మూవీస్ బ్యానర్‌పై శింగనమల రమేశ్ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు సీ కల్యాణ్, ఎస్ సత్య రామమూర్తి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా అన్ని వర్గాల ఆదరణకు గురి కావడం ఆశ్చర్యాన్నే కలిగింది. పూర్తిస్థాయి వినోద భరితంగా అలాగే ఎమోషనల్, డివోషనల్ కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ సినిమా గురించి, ఈ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లు, అలాగే రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్ వసూళ్ల గురించిన వివరాల్లోకి వెళితే..
ఖలేజా సినిమాలో సీనియర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్లు, అలాగే టాప్ టెక్నిషియన్స్ పనిచేశారు. కోట శ్రీనివాసరావు, రావు రమేష్, తనికెళ్ల భరణి, షఫీ, ధర్మవరపు సుబ్రమణ్యం తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు. యష్ భట్, సునీల్ పటేల్ సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ ఏ శ్రీకర్ ప్రసాద్ అందించారు. ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులన్నీ కలుపుకొని ఈ మూవీని 32 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ సుమారుగా 40 కోట్ల రూపాయలు మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మహేష్ బాబు లుక్, స్టయిల్ ట్రెండింగ్‌గా నిలవడం, పాటలు, ప్రోమోలు, ప్రమోషనల్ కంటెంట్‌కు ఫుల్ రెస్పాన్స్ రావడంతో ఖలేజా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అలాంటి భారీ అంచనాలతో ఈ సినిమా అక్టోబర్ 7వ తేదీ 2010 సంవత్సరంలో రిలీజైంది. అయితే ఈ సినిమాకు పూర్తిగా డివైడ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడిపోయింది. దాంతో ఈ సినిమా బాక్పాఫీస్ వద్ద తేలిపోయింది.ఈ సినిమా సుమారుగా 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఖలేజా సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా, నైజాం ప్రాంతాల్లో ఈ మూవీ 24.25 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.6 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా 5.25 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 32.10 కోట్ల గ్రాస్ వసూళ్లు, 18.04 కోట్ల రూపాయల షేర్ వసూలు నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాల రిపోర్టు.

వాస్తవానికి ఖలేజా సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ భారీగా సెట్ అయింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 42 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సిన పరిస్థితి. అయితే ఈ సినినిమా కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయడంతో ఈ చిత్రం సుమారుగా 24 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసుకొన్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నమోదైంది. కానీ ఈ సినిమా టెలివిజన్‌లో ప్రసారమైనప్పుడు, ఓటీటీలో స్ట్రీమింగ్ సమయంలో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడం గమనార్హం.
ప్రస్తుతం ఖలేజా సినిమా రీ రిలీజ్‌కు సిద్దమైంది. ఇప్పటికే రీ రిలీజ్ ట్రెండ్‌లో మహేష్ బాబు పేరు మీదే రికార్డులు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా మే 30వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ నేపథ్యంలో మొదలైన అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే 180,000 టికెట్లు అమ్ముడుపోవడం ఆసక్తిగా మారింది.ఈ సినిమా ఇప్పటికే 4.5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక ఖలేజా4K సినిమా నార్త్ అమెరికాలో గత మూడు రోజులుగా వసూళ్లు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 58K డాలర్లు, 40k డాలర్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు అమెరికా కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటల వరకు 8K డాలర్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో 106K + డాలర్లు వసూలు చేసింది. అమెరికాలో రీ రిలీజ్ సినిమాల్లో 100K దాటిన తొలి సినిమా ఖలేజా అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, యూకేలో 15K డాలర్లు (11K పౌండ్స్0, ఆస్ట్రేలియాలో 9K డాలర్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో వివరాలు అందిన ప్రకారం.. 125K డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 1.06 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లోను సంచలనం రేపుతూ రికార్డు వసూళ్లు రాబడుతున్నది. ఈ సినిమా తొలి రోజు ఆంధ్రా, నైజాంలో 9.2 కోట్ల రూపాయలు, రెండో రోజు ఈ సినిమా 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నైజాంలో రెండు రోజల్లో 4.2 కోట్ల వసూళ్లు సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఈ సినిమా 1 కోటి రూపాయల వరకు కలెక్షన్లు రాబట్టింది.
ఇదిలా ఉండగా, ఖలేజా రీ రిలీజ్ సినిమా రికార్డులు తిరగ రాస్తున్నది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, విదేశాలు అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కోస్తున్నది. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 9.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో లేటేస్ట్ ట్రెండింగ్‌గా ఈ సినిమా కలెక్షన్లు నిలిచాయి.


Click it and Unblock the Notifications











