Khaleja Closing Collections: ఖలేజా క్లోజింగ్ కలెక్షన్లు.. తన మూవీ రికార్డునే మహేష్ బ్రేక్.. ఎన్ని కోట్లంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఖలేజా. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాశ్ రాజ్, సునీల్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు కీలక పాత్రలో నటించారు. కనకరత్న మూవీస్ బ్యానర్‌పై శింగనమల రమేశ్ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు సీ కల్యాణ్, ఎస్ సత్య రామమూర్తి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఫస్ట్ టైమ్ రిలీజ్ సమయంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ తాజాగా రీ రీలీజ్ సందర్భంగా ఈ మూవీ రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా రీ రీలీజ్ క్లోజింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఖలేజా మూవీని సుమారుగా 32 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 40 కోట్ల రూపాయలు మేర జరిగింది. కానీ ఈ చిత్రం రిలీజ్ తర్వాత డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో లైఫ్ టైమ్ థియేట్రికల్ రన్‌లో కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా సుమారుగా 22 కోట్ల రూపాయల నష్టంతో బాక్సాఫీస్ జర్నీని ముగించింది.

అయితే మహేష్ బాబు సినిమాలు రీ రీలీజ్ అయి భారీ కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో ఖలేజా మూవీకి లేటేస్ట్ 4K టెక్నాలజీ హంగులతో విడుదల చేశారు. ఈ సినిమాకు భారీ స్పందన లభించడంతో రికార్డు ఓపెనింగ్స్ సాధించింది. రీ రిలీజ్ సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో హుషారు పుట్టించింది.
ఖలేజా సినిమాకు ఓవర్సీస్‌లో అంటే నార్త్ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో సూపర్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఈ సినిమా నార్త్ అమెరికాలో 100K డాలర్లు వసూలు చేసిన తొలి రీ రిలీజ్ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది అని డిస్టిబ్యూటర్ ప్రత్యాంగీరా సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. అమెరికా, కెనడాలో 140K డాలర్లు వసూలు చేసింది. బ్రిటన్, ఆస్ట్రేలియాతో కలిపి 170K డాలర్ల వరకు వసూలు చేసిందని వెల్లడించారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈ సినిమా 5.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 2 కోట్ల రూపాయలు, మూడో రోజు 1 కోటి రూపాయలు, నాలుగో రోజు 30 లక్షల రూపాయలు, 5వ రోజు 25 లక్షల రూపాయలు, ఆరో రోజు 15 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గత 6 రోజుల్లో 9.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నైజాంలో 5.5 కోట్లు, ఆంధ్రాలో 3 కోట్లు, సీడెడ్‌లో 75 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఖలేజా సినిమా తెలుగు రాష్ట్రాల్లో 9.2 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా మొత్తంగా రి రీలీజ్ ద్వారా 11.7 కోట్ల రూపాయలు ఆర్జించింది. గతంలో మొదటి రిలీజ్ ద్వారా 18 కోట్లతో కలుపుకొని ఈ సినిమా లైఫ్ టైమ్ రన్‌లో 29.7 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఫ్యాన్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం ఈ సినిమా 13.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది రీ రిలీజ్ చరిత్రలో ఓ రికార్డు అని వెల్లడించారు. దాంతో గతంలో మురారీ సినిమా రాబట్టిన 9.12 కోట్ల రూపాయల రికార్డును అధిగమించింది.


Click it and Unblock the Notifications











