Khaleja Day 1 Collections: ఖలేజా బాక్సాఫీస్‌ సంచలనం.. మహేష్ బాబు మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఖలేజా. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాశ్ రాజ్, సునీల్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు కీలక పాత్రలో నటించారు. కనకరత్న మూవీస్ బ్యానర్‌పై శింగనమల రమేశ్ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు సీ కల్యాణ్, ఎస్ సత్య రామమూర్తి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా అన్ని వర్గాల ఆదరణకు గురి కావడం ఆశ్చర్యాన్నే కలిగింది. ఈ సినిమా గురించి, ఈ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లు, అలాగే రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్ వసూళ్ల గురించిన వివరాల్లోకి వెళితే..

ఖలేజా సినిమాలో సీనియర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్లు, అలాగే టాప్ టెక్నిషియన్స్ పనిచేశారు. కోట శ్రీనివాసరావు, రావు రమేష్, తనికెళ్ల భరణి, షఫీ, ధర్మవరపు సుబ్రమణ్యం తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు. యష్ భట్, సునీల్ పటేల్ సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ ఏ శ్రీకర్ ప్రసాద్ అందించారు. ఈ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులన్నీ కలుపుకొని ఈ మూవీని 32 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ సుమారుగా 40 కోట్ల రూపాయలు మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Khaleja Re Release Day 1

భారీ అంచనాలతో ఖలేజా సినిమా అక్టోబర్ 7వ తేదీ 2010 సంవత్సరంలో రిలీజైంది. అయితే ఈ సినిమాకు పూర్తిగా డివైడ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్లపై ప్రభావం పడిపోయింది. దాంతో ఈ సినిమా బాక్పాఫీస్ వద్ద తేలిపోయింది.ఈ సినిమా సుమారుగా 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఖలేజా సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా, నైజాం ప్రాంతాల్లో ఈ మూవీ 24.25 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.6 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా 5.25 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 32.10 కోట్ల గ్రాస్ వసూళ్లు, 18.04 కోట్ల రూపాయల షేర్ వసూలు నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాల రిపోర్టు. అయితే ఈ సినినిమా కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయడంతో ఈ చిత్రం సుమారుగా 24 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసుకొన్నది.

తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఖలేజా సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించగానే.. సినీ ప్రేక్షకులు, మహేష్ అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు అయ్యాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు నుంచే రికార్డు వసూళ్లను నమోదు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఖలేజా మూవీ రీ రిలీజ్ చేసి ప్రదర్శించేందుకు సుమారుగా 2 కోట్ల రూపాయలు చెల్లించి వరల్డ్ వైడ్ రైట్స్ తీసుకొన్నారు. అయితే ఈ సినిమా మే 30న రిలీజ్ కావడానికి ముందే మొత్తంగా 6 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. దాంతో ఈ సినిమా రీ రిలీజ్‌కు ముందే 150 శాతం లాభాలను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా కరెంట్ బుకింగ్ ద్వారా భారీగా కలెక్షన్లు నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

అయితే ఖలేజా మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రదర్శించిన ప్రతీ థియేటర్‌లోను హౌస్‌పుల్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. కర్ణాటకలోని బెంగళూరులో కూడా రికార్డు బుకింగ్ కనిపించాయి. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్ మార్కెట్‌లో 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. మొత్తంగా ఈ సినిమా 6 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X