Khaleja Day 2 Collections: ఖలేజా కలెక్షన్ల ఊచకోత.. విదేశీ గడ్డపై మహేష్ సంచలనం.. వసూళ్లు ఎన్ని కోట్లంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఖలేజా. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాశ్ రాజ్, సునీల్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు కీలక పాత్రలో నటించారు. కనకరత్న మూవీస్ బ్యానర్‌పై శింగనమల రమేశ్ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు సీ కల్యాణ్, ఎస్ సత్య రామమూర్తి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఫస్ట్ టైమ్ రిలీజ్ సమయంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ తాజాగా రీ రీలీజ్ సందర్భంగా ఈ మూవీ రికార్డులు తిరగరాస్తున్నది.ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు, అలాగే 2వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..
ఖలేజా ఈ మూవీని సుమారుగా 32 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 40 కోట్ల రూపాయలు మేర జరిగింది. కానీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో లైఫ్ టైమ్ థియేట్రికల్ రన్‌లో కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా సుమారుగా 22 కోట్ల రూపాయల నష్టంతో బాక్సాఫీస్ జర్నీని ముగించింది.

అలాంటి ఖలేజా సినిమా రీరీలీజ్‌కు అభిమానులు, ప్రేక్షకులు పోటెత్తారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా.. 180K టికెట్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా 5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా రీ రీలీజ్ థియేట్రికల్ రైట్స్‌ను 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో రిలీజ్‌కు ముందే ఈ సినిమా భారీ లాభాల్లోకి చేరుకొన్నది. ఇక విడుదల తర్వాత రికార్డు వసూళ్లు రాబడుతున్నది.
ఖలేజా రీ రిలీజ్ మూవీ కర్ణాటకలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. రీ రిలీజ్ హిస్టరీలో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందు ప్రదర్శించిన రెండు ప్రీమియర్లకు అనూహ్యమైన కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా తొలి రోజు కర్ణాటకలో 35 లక్షల రూపాయల వసూలు చేసింది. ఇప్పటి వరకు కర్ణాటకలో ఇంటర్‌స్టెల్లర్ చిత్రం 72 లక్షలు వసూలు చేయగా.. తెలుగు సినిమా పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ రీ రిలీజ్ 50 లక్షల రూపాయలు రాబట్టింది. ఈ చిత్రం తెలుగు రీ రిలీజ్‌లో రెండో అతిపెద్ద వసూళ్లు సాధించిన ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది.
ఓవర్సీస్‌లో కూడా ఖలేజా రీ రిలీజ్ సంచలనం రేపింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో రికార్డు వసూళ్లు రాబట్టింది. అమెరికాలో ఈ సినిమా తొలి రోజు 95K డాలర్లు, యూకేలో 14K డాలర్లు (11K పౌండ్స్, ఆస్ట్రేలియాలో 14K ఆస్ట్రేలియా డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఓవర్సీస్‌లో 120k డాలర్లు అంటే.. ఒక కోటి రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
అయితే ఖలేజా తొలిసారి రిలీజ్ అయినప్పుడు ఆంధ్రా, నైజాంలో కలిపి 5.75 కోట్ల గ్రాస్, 4.1 కోట్ల షేర్ రాబట్టింది. కానీ తాజాగా ఈ సినిమా ఆ రికార్డును అధిగమించింది. నైజాంలోనే ఈ సినిమా 3 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 4.5 కోట్ల రూపాయలతో 7.5 కోట్లు, ఓవర్సీస్‌లో ఒక కోటి రూపాయలు, కర్ణాటకలో 35 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 9.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఖలేజా రీ రీలీజ్ సినిమాకు రెండో రోజు కూడా భారీ కలెక్షన్లు నమోదు కానున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రెండో అడ్వాన్స్ బుకింగ్‌కు సుమారుగా 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో 5 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 7.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 16 నుంచి 17 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











