Khaleja Day 4 Collections: సలార్ రికార్డును బ్రేక్ చేసిన ఖలేజా.. మహేష్ మూవీ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఖలేజా. ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాశ్ రాజ్, సునీల్, బ్రహ్మానందం, ఆలీ తదితరులు కీలక పాత్రలో నటించారు. కనకరత్న మూవీస్ బ్యానర్‌పై శింగనమల రమేశ్ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకు సీ కల్యాణ్, ఎస్ సత్య రామమూర్తి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఫస్ట్ టైమ్ రిలీజ్ సమయంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ తాజాగా రీ రీలీజ్ సందర్భంగా ఈ మూవీ రికార్డులు తిరగరాస్తున్నది.ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు, అలాగే 2వ రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..

ఖలేజా ఈ మూవీని సుమారుగా 32 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 40 కోట్ల రూపాయలు మేర జరిగింది. కానీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో లైఫ్ టైమ్ థియేట్రికల్ రన్‌లో కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా సుమారుగా 22 కోట్ల రూపాయల నష్టంతో బాక్సాఫీస్ జర్నీని ముగించింది.

Khaleja Re Release Box Office

అలాంటి ఖలేజా సినిమా రీరీలీజ్‌కు అభిమానులు, ప్రేక్షకులు పోటెత్తారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా.. 180K టికెట్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా 5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా రీ రీలీజ్ థియేట్రికల్ రైట్స్‌ను 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో రిలీజ్‌కు ముందే ఈ సినిమా భారీ లాభాల్లోకి చేరుకొన్నది. ఇక విడుదల తర్వాత రికార్డు వసూళ్లు రాబడుతున్నది. ఇక జూన్ 4వ తేదీన ఈ సినిమా రీ రిలీజ్ ఫేర్‌వెల్ సెలబ్రేషన్స్‌ను హైదరాబాద్‌లోని ఎక్స్ రోడ్‌లో ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించే చివరి షో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఖలేజా సినిమా గత 4 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, నైజాంలో కలిపి తొలి రోజు 5.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 2 కోట్ల రూపాయలు, మూడో రోజు 1.10 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 70 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 9.30 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, నైజాం, సీడెడ్, హైదరాబాద్‌ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇప్పటి వరకు ఈ సినిమా నైజాంలో అత్యధికంగా వసూళ్లను నమోదు చేసింది. హైదరాబాద్‌లోనే 1 కోటి రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా హైదరాబాద్‌తో కలిపి నైజాంలో 5.5 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. ఇక ఆంధ్రాలో 3 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 80 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రికార్డు వసూళ్లను రాబట్టింది.

ఇక కర్ణాటకలో ఈ సినిమా 1 కోటి రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఖలేజా చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రత్యాంగిర సినిమాస్ అధికారికంగా వెల్లడించిన ప్రకారం.. ఈ సినిమా 100K డాలర్లు వసూలు చేసింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లు ఇంకా అందాల్సి ఉంది. ఆస్ట్రేలియాలో 17k ఆస్ట్రేలియన్ డాలర్లు, యూకేలో 13K డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఖలేజా4K సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రోజు సుమారుగా 8 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు 2.35 కోట్లు, మూడో రోజు 1.25 కోట్లు, నాలుగో రోజు 75 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 12.35 కోట్ల రూపాయలు వసూలు చేసంది. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 సినిమా కలెక్షన్లను మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రం బ్రేక్ చేసింది అని చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X