Khel Khel Mein Collections: 110 కోట్ల టార్గెట్.. అక్షయ్ కుమార్ మూవీకి డిజాస్టర్ కలెక్షన్లు!

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేల్ మే చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. టీ సీరీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో పర్దీన్ ఖాన్, వాణి కపూర్, తాప్సీ పన్ను, ప్రగ్యా జైస్వాల్, ఆమీ విర్క్ తదితరులు నటించారు. భూషణ్ కుమార్, విపుల్ షా నిర్మాతలుగా రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం సినీ విమర్శకులు ప్రతికూలంగా స్పందించడంతో బాక్సాఫీస్ వద్ద తడబాటుతో మొదలైంది. ఈ సినిమా తొలి వారాంతంలో ఎంత మేరకు వసూళ్లను సాధించిందనే వివరాల్లోకి వెళితే..

ఖేల్ ఖేల్ మే చిత్రంలో టాప్ బాలీవుడ్ యాక్టర్లందరూ నటించడంతో వారి రెమ్యునరేషన్లు, అలాగే సాంకేతిక నిపుణులు పారితోషికాలు భారీగా ఉండటంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ప్రమోషన్స్, ఇతర కార్యక్రమాల ఖర్చుతో కలిపి ఈ సినిమా ఖర్చు 100 కోట్ల మేర బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సుమారుగా 110 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

Khel Khel Mein Day 4 Box Office Collection Worldwide Akshay Kumar movie in disaster way

ఇక ఈ సినిమాకు స్త్రీ 2, వేదా లాంటి హిందీ చిత్రాలు భారీగా పోటీని ఇచ్చాయి. ఆ పోటీని తట్టుకొనే విధంగా ఈ సినిమాను భారీగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇండియాలో 2000 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొత్తంగా ఈ సినిమాను 3500 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ చిత్రం తొలి రోజున మిక్స్‌డ్ టాక్‌తో వసూళ్ల ప్రయాణాన్నిమొదలు పెట్టింది. ఈ సినిమా తొలిరోజు 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు ఈ చిత్రం 3.5 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.ఇక మూడో రోజు కూడా అదే స్థాయిలో వసూళ్ళను నమోదు చేస్తూ.. 3.5 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 3 రోజుల్లో 12.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రం ఆదివారం కూడా పెద్దగా ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టలేకపోయింది. ఈ చిత్రం 4వ ఈ సినిమా 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లనురాబట్టింది.దాంతో ఈ సినిమా కేవలం 17.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడమనేది కష్టంగా కనిపిస్తున్నది. తొలి వారమే ఈ సినిమా క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. స్త్రీ 2 సినిమా నుంచి వస్తున్నపోటీ బారీగా ఉండటంతో అక్షయ్ కుమార్ సినిమా తట్టుకోవడం కష్టమే అనే పరిస్థితి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X