Khiladi day 1 collections: రవితేజ మూవీకి రెండు రకాల దెబ్బ.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
కరోనావైరస్ థర్డ్‌వేవ్ తర్వాత టాలీవుడ్ సినిమాల రిలీజ్‌తో కళకళలాడింది. భారీ బడ్జెట్ చిత్రాలతోపాటు మీడియం రేంజ్ సినిమాలు థియేట్రికల్‌గా, ఓటీటీలో పోటెత్తాయి. అయితే ప్రధానంగా మాస్ మహారాజా నటించిన ఖిలాడీ చిత్రంపై అందరి దృష్టి నెలకొన్నది. రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో తొలిరోజు కలెక్షన్లపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఫస్ట్ డే కలెక్షన్ల అంచనా ఎంత ఉందంటే?

50 శాతం అక్యుపెన్సీ కారణంగా
దర్శకుడు రమేశ్ వర్మ, నిర్మాత కోనేరు సత్యనారాయణ, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన ఖిలాడి సినిమా తొలి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే ఊహించినంతగా ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు. ఇక ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ కారణంగా భారీగా కలెక్షన్లు నమోదు కాలేదు. ఇక తెలంగాణలో టికెట్ రేట్ ఎక్కువగా ఉండటం కూడా వసూళ్లపై ప్రభావం పడింది.

హిందీలో ఆలస్యంగా షోలు
రవితేజ నటించిన ఖిలాడీ చిత్రం తొలిసారి హిందీ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా ఉత్తరాదిలో ఆలస్యంగా షోలు పడ్డాయి. దీంతో తొలి రోజు వసూళ్లపై కొంచెం దెబ్బ పడిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే రెండో రోజు ఈ సినిమా స్టామినా హిందీ బాక్సాఫీస్ వద్ద తెలిసే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఆక్యుపెన్సీ
తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా 33 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మార్నింగ్ షోకు 34 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా.. మ్యాట్నీకి 30 శాతం, ఫస్ట్ షోకు 34 శాతం, సెకండ్ షోకు నైజాంలో 25 శాతం మేర అక్యుపెన్సీ నమోదైందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.

ఖిలాడీ ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక ఖిలాడీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 8 కోట్ల రూపాయల మేర, సీడెడ్‌లో 2.8 కోట్లు, ఆంధ్రాలో 8.7 కోట్ల మేర బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల మొత్తం బిజినెస్ 19.50 కోట్లు బిజినెస్ నమోదైంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల బిజినెస్ 2.10 కోట్లు, ఓవర్సీస్ 1.2 కోట్ల మేర జరిగాయి. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 22..80 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..23.5 కోట్లు బాక్సాఫీస్ వద్ద రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తొలి రోజు కలెక్షన్లు ఇలా..
తాజా సమాచారం ప్రకారం ఖిలాడి తొలి రోజు కలెక్షన్లు ఓ మోస్తరుగా ఉన్నట్టు తెలిసింది. నైజాం, ఆంధ్రా ప్రాంతాల్లో సుమారు 5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 6 నుంచి 7 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











