యష్ టాక్సిక్.. కియారా అద్వానీ షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె టాలీవుడ్ లోకి 2018లోనే ఎంట్రీ ఇచ్చింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'భరత్ అనే నేను' చిత్రంలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. తనకు అదే తెలుగులో తొలిచిత్రం. మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఆ వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. 'వినయ విధేయ రామ' చిత్రంతో చరణ్ కు జోడీగా పర్ఫెక్ట్ సెట్ అయ్యింది. కానీ ఆ మూవీ కియారాకు పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయింది.
మళ్లీ ఐదేళ్ల గ్యాప్ తర్వాత కియారా అద్వానీ 'గేమ్ ఛేంజర్'తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - క్రియేటివ్ అండ్ టాప్ డైరెక్టర్ ఎస్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'గేమ్ ఛేంజర్' చిత్రంలో నటించింది. రామ్ చరణ్ కు ప్రేయసి పాత్రలో ఒదిగిపోయింది. అయితే ఈ సినిమాలో కూడా కియారాకు పెద్దగా సక్సెస్ ను ఇవ్వలేదు. రామ్ చరణ్ పెర్ఫామెన్స్ తోనే థియేటర్లలో ఆడింది. సినిమా సబ్జెక్ట్, చరణ్ పెర్ఫామెన్స్ సరిగానే ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం ఎందుకు విఫలమైంది. ఇలా కియారా అద్వానీ తెలుగులోని బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో అవకాశాలు దక్కించుకుంటూ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. కియారా మరోసారి సౌత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దక్షిణాదిలోని కన్నడ చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం 'టాక్సిస్'లో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. కేజీఎఫ్ 2 స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ భారీ ఫిల్మ్ ను గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించి షూటింగ్ పార్ట్ త్వరత్వరగా పూర్తి అవుతోంది. రీసెంట్ గానే టీమ్ ముంబై షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకొని... చెన్నైలో మరో షెడ్యూల్ కు సిద్దమైంది. కియారా కూడా ఇప్పటికే షూటింగ్ కు హాజరైనట్టు తెలుస్తోంది.
అయితే, కియారా అద్వానీ యష్ 'టాక్సిక్' చిత్రానికి భారీ రెమ్యునరేషణ్ తీసుకుంటున్నదని తెలుస్తోంది. ఇప్పుడీ వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏకంగా రూ.15 కోట్లు ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె కెరియర్ లో నే కియారా అద్వానీకి ఈ రెమ్యునరేషన్ హయ్యేస్ట్ అని చెబుతున్నారు. బాలీవుడ్ లోనూ ఫుల్ బిజీగా ఉండటంతో కియారా తన రెమ్యునరేషన్ ను పెంచేసినట్టు తెలుస్తోంది. గత చిత్రంతో పోల్చితే కియారా తన పారితోషికాన్ని ఏకంగా మూడింతల రెట్లు పెంచేసింది.
చివరిగా రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్'లో నటించేందుకు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నదంట కియారా అద్వానీ. కానీ టాక్సిక్ చిత్రానికి ఏకంగా మూడింతలు పెంచేసి రూ.15 కోట్లు అందుకుంటోందని సమాచారం. ఇక కియారా అద్వానీ ఇటీవలనే ఫిబ్రవరిలో తన ప్రెగ్నెన్సీని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో కొన్నాళ్లు ఆమెకు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక కియారా అద్వానీ బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను 2023 ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకుంది. ఇక 'టాక్సిక్' చిత్రంతో పాటు, బాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న 'వార్2'లో హృతిక్ రోషన్ కు జోడీగా నటిస్తోంది. ఈ సీక్వెల్ లో ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











