For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bhool Bhulaiyaa 2 Collections.. 100 కోట్లకు చేరువగా కియారా అద్వానీ మూవీ.. 5 రోజుల్లో ఎంతంటే?

    |

    బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన భూల్ భులయ్యా 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. అనీస్ బజ్మీ రూపొందించిన ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధంగా ఉంది. మే 20 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇటీవల కాలంలో భారీ వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా ఘనతను సాధించింది.

    మంగళవారం అంటే.. మే 24వ తేదీన భూల్ భులయ్యా 2 చిత్రం డబుల్ డిజిట్ కలెక్షన్లు సాధించింది. ఇటీవల కాలంలో 4వ రోజు ఈ రేంజ్‌లో వసూలు చేసిన సినిమా లేదు. బీ, సీ సెంటర్లలో ఈ చిత్రం ఎక్సలెంట్‌గా వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది అనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

    Kiara Advanis Bhool Bhulaiyaa 2 movie 5 days India wide Collections

    భూల్ భులయ్యా చిత్రం శుక్రవారం 14.11 కోట్లు, శనివారం 18.34 కోట్లు, ఆదివారం 23.51 కోట్లు, సోమవారం 10.75 కోట్లు, మంగళవారం సుమారు 10 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 76.27 కోట్ల షేర్‌ను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    ఇక భూల్ భులయ్యా 2 చిత్రాన్ని హీరో కార్తీక్ ఆర్యన్ ముంబైలో ప్రేక్షకులతో కలిసి సినిమాను చూశాడు. ముంబైలోని గైయిటీ గెలాక్సీ థియేటర్‌లో సినిమా చూసేందుకు రాగా, ప్రేక్షకులు. అభిమానులు భారీగా స్వాగతం పలికారు. కార్తీక్ ఆర్యన్‌ను చూసేందుకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో రావడం గమనార్హం.

    English summary
    Karthik Aryan and Kiara Advani's Bhool Bhulaiyaa 2 movie doing good at box office. It collectied 76 crores in 5 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X