twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vikrant Rona 7 Days Collection: 75 కోట్ల టార్గెట్.. వారంలోనే అన్ని కోట్లు.. ఇంకెంత రావాలంటే!

    |

    కన్నడ చిత్ర పరిశ్రమలో రెండు మూడు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు కిచ్చా సుదీప్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. స్టార్‌డమ్‌తో పాటు మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకున్నాడు. దీంతో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'విక్రాంత్ రోణ' అనే సినిమాతో సుదీప్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ విశేషమైన స్పందన లభించింది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు కూడా అత్యధిక మొత్తంలోనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ' మొదటి వారం రిపోర్టును చూద్దాం పదండి!

    విక్రాంత్ రోణగా ఎంటరైన సుదీప్

    విక్రాంత్ రోణగా ఎంటరైన సుదీప్

    కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ భండారి తీసిన విజువల్ వండర్ ఫిల్మే 'విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ కాగా.. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా నిర్మించారు.

    యాంకర్ శ్రీముఖి గ్లామర్ షో: అబ్బో ఆమె అందాలు చూసి తట్టుకోగలరా!యాంకర్ శ్రీముఖి గ్లామర్ షో: అబ్బో ఆమె అందాలు చూసి తట్టుకోగలరా!

    బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

    బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

    కిచ్చా సుదీప్ తనదైన చిత్రాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నాడు. దీనికితోడు 'విక్రాంత్ రోణ' మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడింది. ఫలితంగా అన్ని చోట్ల మంచి ధరలకే ఇది అమ్ముడైంది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.50 కోట్లు బిజినెస్ అయినట్లు తెలిసింది.

    7వ రోజు ఎంత కలెక్షన్ వచ్చింది

    7వ రోజు ఎంత కలెక్షన్ వచ్చింది

    కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' చిత్రానికి 7వ రోజు కర్నాటకలో రూ. 2 - 2.50 కోట్లు గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, మలయాళంలో రూ. 10 లక్షలు లోపు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 లక్షల లోపు గ్రాస్, తమిళనాడులో రూ. 30 లక్షల లోపు గ్రాస్ రాబట్టింది. అలాగే, హిందీలో ఈ చిత్రానికి రూ. 40 - 60 లక్షలు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

    శివాని రాజశేఖర్ అందాల ఆరబోత: తొలిసారి ఇంత హాట్‌గా కనిపించడంతో!శివాని రాజశేఖర్ అందాల ఆరబోత: తొలిసారి ఇంత హాట్‌గా కనిపించడంతో!

    వారం రోజుల్లో ఎంత వచ్చింది?

    వారం రోజుల్లో ఎంత వచ్చింది?

    సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' చిత్రానికి వారం రోజులకు కలిపి కర్నాటకలో రూ. 75 - 78 కోట్లు గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, మలయాళంలో రూ. 1.50 - 1.70 కోట్లు గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 - 7.50 కోట్లు గ్రాస్, తమిళనాడులో రూ. 3 - 3.20 కోట్లు గ్రాస్ రాబట్టింది. అలాగే, హిందీలో ఈ చిత్రానికి రూ. 6.50 - 7 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ సమాచారం.

    ఓవర్సీస్‌లో ఎంత వచ్చిందంటే

    ఓవర్సీస్‌లో ఎంత వచ్చిందంటే

    సుదీప్ - అనూప్ భండారి కాంబినేషన్‌లో రూపొందిన 'విక్రాంత్ రోణ' మూవీకి ఓవర్సీస్‌లో అంతగా రెస్పాన్స్ రావడం లేదు. ఈ చిత్రానికి ప్రీమియర్స్ ద్వారా 19,418 డాలర్లు వచ్చాయి. అలాగే, మొదటి రోజు 44,820 డాలర్లు వసూలు అయ్యాయి. ఆ తర్వాత కలిపి మాత్రం ఈ సినిమాకు 1.60 లక్ష డాలర్లు అంటే రూ. 1.28 కోట్లు వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

    మేకప్ రూంలో తెలుగు హీరోయిన్ హాట్ ట్రీట్: ఆ పార్ట్‌లను హైలైట్ చేస్తూ!మేకప్ రూంలో తెలుగు హీరోయిన్ హాట్ ట్రీట్: ఆ పార్ట్‌లను హైలైట్ చేస్తూ!

    7 రోజుల్లో షేర్ మొత్తం ఎంతంటే

    7 రోజుల్లో షేర్ మొత్తం ఎంతంటే

    ట్రేడ్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 107 - 110 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే, ఈ చిత్రానికి రూ. 56 - 58 కోట్లు షేర్ వరకూ వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, వారం రోజుల్లోనే ఈ సినిమాకు దాదాపు 82 శాతం షేర్ వసూలు అయినట్లు తెలుస్తోంది.

    ఇంకెంత వస్తే హిట్ అవుతుంది?

    ఇంకెంత వస్తే హిట్ అవుతుంది?

    క్రేజీ కాంబినేషన్‌లో విజువల్ వండర్‌గా వచ్చిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.50 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 75 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ. 55 - 58 కోట్ల షేర్‌ను రాబట్టింది. అంటే మరో రూ. 18 కోట్లు వసూలు చేస్తేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుంటుంది.

    English summary
    Kiccha Sudeep Did Vikrant Rona Movie Under Anup Bhandari Direction. This Movie Collects 107 - 110 Crore gross in 1 Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X