Vikrant Rona Telugu Collections: తేలిపోయిన కన్నడ సినిమా.. అయినా అప్పుడే అన్ని కోట్ల లాభాలు

తెలుగు సినిమా మార్కెట్‌పై ప్రభావాన్ని చూపించాలని చాలా మంది సౌతిండియన్ స్టార్ హీరోలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే కొంత మంది టాలీవుడ్‌లో మార్కెట్‌ను ఏర్పరచుకుని సత్తా చాటారు. ఇలా మరికొందరు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ 'విక్రాంత్ రోణ' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమా ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే దీనికి స్పందన భారీ స్థాయిలో వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా అత్యధికంగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ' సినిమా 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

విక్రాంత్ రోణగా సుదీప్ అరాచకం

విక్రాంత్ రోణగా సుదీప్ అరాచకం


కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ భండారి తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీనే 'విక్రాంత్ రోణ'. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ దీన్ని నిర్మించారు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా చేసింది. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు.

బిజినెస్‌కు తగ్గట్లే గ్రాండ్‌గా రిలీజ్

బిజినెస్‌కు తగ్గట్లే గ్రాండ్‌గా రిలీజ్


కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ 'ఈగ', 'బాహుబలి', 'సైరా: నరసింహారెడ్డి' వంటి చిత్రాలతో తెలుగులో సందడి చేశాడు. దీంతో తాజాగా ఆయన చేసిన కన్నడ చిత్రం 'విక్రాంత్ రోణ'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 1.25 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ సమాచారం.

10వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?

10వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?


కన్నడంలో మాదిరిగానే తెలుగులో కూడా 'విక్రాంత్ రోణ' అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో స్పందన దక్కింది. దీంతో ఇక్కడ కలెక్షన్లు అత్యధిక మొత్తంలో వస్తున్నాయి. అయితే, 10వ రోజు కేవలం ఈ సినిమాకు వసూళ్లు కాస్త పెరిగి రూ. 7 లక్షలు షేర్, 14 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

Recommended Video

Young Techie12 ఏళ్లకే 3 యాప్స్ తయారు... కోట్లు సంపాదించే ఛాన్స్ *Tech | Telugu OneIndia
10 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

10 రోజులకు కలిపి ఎంత వచ్చింది?


'విక్రాంత్ రోణ'కు 10 రోజుల్లో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.59 కోట్లు, సీడెడ్‌లో రూ. 51 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 50 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, గుంటూరులో రూ. 34 లక్షలు, కృష్ణాలో రూ. 30 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.93 కోట్లు షేర్, రూ. 7.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?


క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'విక్రాంత్ రోణ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.50 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 3.93 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.43 కోట్లు లాభాలు దక్కాయి.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు


కిచ్చా సుదీప్ - అనూప్ భండారి కాంబోలో వచ్చిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని 10 రోజుల్లో రూ. 114 - 115 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఈ చిత్రానికి రూ. 57 కోట్లు పైగానే షేర్ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ సినిమా ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసి ప్రపంచ వ్యాప్తంగా హవాను చూపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X