Vikrant Rona Telugu Collections: తెలుగులో 1.25 కోట్ల బిజినెస్.. వారంలోనే అన్ని కోట్లు.. లాభమెంతంటే!
దక్షిణాదిలోని పలు ఇండస్ట్రీలకు చెందిన హీరోలు తెలుగులో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని భాషల స్టార్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సృష్టించుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు రాష్ట్రాల్లో సందడి చేసేందుకు 'విక్రాంత్ రోణ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొత్తం ఐదు భాషల్లో రూపొందిన ఈ సినిమాకు అన్ని చోట్ల భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ముఖ్యంగా తెలుగులో విశేషమైన రెస్పాన్స్‌తో కలెక్షన్లను భారీగా రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ' సినిమా వారం రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

విక్రాంత్ రోణగా సుదీప్ వచ్చాడు
కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ భండారి రూపొందించిన సినిమానే 'విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటించింది. అలాగే, నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ దీన్ని నిర్మించారు.

బిజినెస్‌కు తగ్గట్లే గ్రాండ్‌గా రిలీజ్
కిచ్చా సుదీప్ 'ఈగ', 'బాహుబలి', 'సైరా: నరసింహారెడ్డి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో తాజాగా ఆయన చేసిన కన్నడ చిత్రం 'విక్రాంత్ రోణ'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 1.25 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

7వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?
విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'విక్రాంత్ రోణ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్పందన లభించింది. దీంతో ఇక్కడ కలెక్షన్లు అత్యధిక మొత్తంలో వసూలు అవుతున్నాయి. అయితే, ఇప్పుడు వీక్ డేస్ నడుస్తుండడంతో వసూళ్లు కాసింత పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విక్రాంత్ రోణకు 7వ రోజు రూ. 17 లక్షలు షేర్, 35 లక్షలు గ్రాస్ వచ్చింది.

వారం రోజుల్లో ఎంత వసూలైంది?
వారం రోజుల్లో 'విక్రాంత్ రోణ'కు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 48 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 46 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 30 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 33 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.71 కోట్లు షేర్, రూ. 7.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
విజువల్ వండర్‌గా వచ్చిన 'విక్రాంత్ రోణ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.50 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 3.71 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.21 కోట్లు లాభాలు దక్కాయి.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు
కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ భండారి రూపొందించిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఆరు రోజుల్లో రూ. 107 - 110 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఈ చిత్రానికి రూ. 50 కోట్లు పైగానే షేర్ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ సినిమా ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసి ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది.


Click it and Unblock the Notifications











