Vikrant Rona 2 Days Collection: 2వ రోజు షాకింగ్ వసూళ్లు.. మన దగ్గరే భారీగా.. టోటల్‌గా ఎంతంటే!
కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా స్టార్‌గా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు కిచ్చా సుదీప్. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు. అయినప్పటికీ ఈ మధ్య కాలంలో పెద్దగా సక్సెస్‌ను మాత్రం సొంతం చేసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే సుదీప్ ఇటీవలే 'విక్రాంత్ రోణ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అడ్వెంచర్ యాక్షన్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఫలితంగా తొలిరోజు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ'కు రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు ఏ రేంజ్‌లో వచ్చాయో మీరే చూడండి!

విక్రాంత్ రోణగా సుదీప్ అరాచకం
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ - అనూప్ భండారి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ కాగా.. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించాడు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్
పేరుకు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. సుదీప్‌కు దక్షిణాది మొత్తంలోనూ ఫాలోయింగ్, మార్కెట్ భారీగా ఏర్పడ్డాయి. అలాగే, మధ్యలో హిందీ ప్రేక్షకులను కూడా ఆయన అలరించడంతో అక్కడ కూడా కాస్త ఫ్యాన్ బేస్‌ను వచ్చింది. దీంతో 'విక్రాంత్ రోణ'కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 73.50 కోట్లు బిజినెస్ జరిగింది.
రెండో రోజు ఎంత వసూలైంది?
కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' చిత్రానికి రెండో రోజు కర్నాటకలో రూ. 10 - 15 కోట్లు గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, మలయాళంలో రూ. 50 లక్షలు లోపు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 80 లక్షల లోపు గ్రాస్, తమిళనాడులో రూ. 50 లక్షల లోపు గ్రాస్ రాబట్టింది. అలాగే, హిందీలో ఈ చిత్రానికి రూ. 1 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

రెండు రోజులకు కలిపి ఎంతంటే
సుదీప్ 'విక్రాంత్ రోణ' చిత్రానికి రెండు రోజులకు కలిపి కర్నాటకలో రూ. 30 - 35 కోట్లు గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, మలయాళంలో రూ. 1 - 1.50 కోట్లు గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో రూ. 1 - 1.80 కోట్లు గ్రాస్, తమిళనాడులో రూ. 1 - 1.50 కోట్లు గ్రాస్ రాబట్టింది. అలాగే, హిందీలో ఈ చిత్రానికి రూ. 2 - 3 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు తాజా లెక్కల ద్వారా సమాచారం.

ఓవర్సీస్‌లో ఎంత వచ్చిందంటే
'విక్రాంత్ రోణ' మూవీకి ఓవర్సీస్‌లో అంతగా రాణించడం లేదని చెప్పొచ్చు. ఈ చిత్రానికి ప్రీమియర్స్ ద్వారా 19,318 డాలర్లు వచ్చాయి. అలాగే, మొదటి రోజు 43,820 డాలర్లు వసూలు అయ్యాయి. అంటే ఓవర్సీస్‌లో మొత్తంగా రూ. 34.86 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక, రెండు రోజులకు కలిపి మాత్రం ఈ సినిమాకు 60 వేల డాలర్లు అంటే రూ. 40 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది.

రెండు రోజుల్లో మొత్తం ఎంతంటే
ట్రేడ్ లెక్కల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 55 - 60 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే, ఈ చిత్రానికి రూ. 25 - 28 కోట్లు షేర్ వరకూ వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, తెలుగులో మాత్రమే ఈ చిత్రానికి అనుకున్న దానికంటే భారీ కలెక్షన్లు వస్తున్నాయట.


Click it and Unblock the Notifications











