Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Vikrant Rona Telugu Collections: సగానికి సగం డౌన్.. అయినా గొప్పగానే.. 2 రోజుల్లోనే అన్ని కోట్లు
కన్నడ చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ హవాను చూపిస్తోన్నాడు కిచ్చా సుదీప్. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. స్టార్డమ్తో పాటు ఫాలోయింగ్‌ను భారీగా సంపాదించుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో భారీ సక్సెస్‌ను అందుకోవడంలో విఫలమైన ఈ స్టార్.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో 'విక్రాంత్ రోణ' అనే సినిమాను చేశాడు.
అడ్వెంచర్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ'కు రెండు రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో ఎంత కలెక్షన్లు వచ్చాయో మీరే చూడండి!
విక్రాంత్ రోణగా ఎంటరైన సుదీప్
కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ భండారి తెరకెక్కించిన అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీనే 'విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ కాగా.. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని ఇచ్చాడు.
స్టేజ్ మీదే హీరోయిన్‌కు ముద్దులు: ఏకంగా ఇద్దరితో.. ఆమె రియాక్షన్ చూశారంటే!
బిజినెస్‌కు తగ్గట్లే గ్రాండ్‌గా రిలీజ్
దక్షిణాది మొత్తంలో మార్కెట్‌ను ఏర్పరచుకున్న కిచ్చా సుదీప్ నటించిన తాజా చిత్రమే 'విక్రాంత్ రోణ'. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా, తెలంగాణలో కలిపి ఈ సినిమాకు రూ. 1.25 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రెండో రోజు ఎక్కడ ఎంతొచ్చింది
'విక్రాంత్ రోణ'కు ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజు రెస్పాన్స్ తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 17 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 36 లక్షలు షేర్‌తో పాటు రూ. 75 లక్షలు గ్రాస్ వచ్చింది.
షార్ట్ డ్రెస్‌లో యాంకర్ హరితేజ రచ్చ: నడిరోడ్డు మీదే అలా.. వీడియో వైరల్
2 రోజులకు కలిపి ఎంత వచ్చింది
'విక్రాంత్ రోణ'కు రెండు రోజుల్లో కలెక్షన్లు మంచిగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 58 లక్షలు, సీడెడ్‌లో రూ. 17 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 18 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 12 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.38 కోట్లు షేర్, రూ. 2.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 1.38 కోట్లు వచ్చాయి. అంటే మరో 12 లక్షలు వసూలు చేస్తే ఇది హిట్ స్టేటస్ అందుకుంటుంది.
Mehreen Kaur Pirzada: మెహ్రీన్ అందాల విందు.. అబ్బో ఆమె డ్రెస్ చూస్తే!
ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు
కన్నడ స్టార్ హీరో సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రెండు రోజుల్లో రూ. 50 - 55 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఈ చిత్రానికి రూ. 25 కోట్లు పైగా షేర్ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ సినిమా హిట్ అవ్వాలంటే మరో రూ. 50 కోట్లు వరకూ వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.