Vikrant Rona 3 Days Collection: 3వ రోజు ఊహించని విధంగా.. అప్పుడే అన్ని కోట్లు.. మొత్తం ఎంతంటే!

గతంలో పోలిస్తే ఈ మధ్య కాలంలో దక్షిణ భారతదేశంలో భారీ బడ్జెట్ చిత్రాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందులోనూ తెలుగు, కన్నడం నుంచే ఈ తరహా సినిమాలు రూపొందుతోన్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో చాలా వరకూ దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించాయి. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు వచ్చిన చిత్రం 'విక్రాంత్ రోణ'.

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. అలా గత గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన భారీగానే దక్కుతోంది. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ'కు మూడో రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసిందో చూడండి!

విక్రాంత్ రోణగా సుదీప్ సందడి

విక్రాంత్ రోణగా సుదీప్ సందడి

కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ భండారి రూపొందించిన విజువల్ వండర్ మూవీనే ‘విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ కాగా.. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఇచ్చాడు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

కన్నడ చిత్ర పరిశ్రమలో బడా స్టార్ మూవీ కావడంతో పాటు విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకోవడంతో ‘విక్రాంత్ రోణ'కు అన్ని ఏరియాల్లోనూ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇలా అన్ని చోట్ల మంచి ధరలకే దీన్ని కొనుగోలు చేశారు. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 73.50 కోట్లు బిజినెస్ జరిగింది.

మూడో రోజు ఎంత వసూలైంది?

మూడో రోజు ఎంత వసూలైంది?

కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ' చిత్రానికి రెండో రోజు కర్నాటకలో రూ. 9 - 12 కోట్లు గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, మలయాళంలో రూ. 30 లక్షలు లోపు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 1 కోటి లోపు గ్రాస్, తమిళనాడులో రూ. 80 లక్షల లోపు గ్రాస్ రాబట్టింది. అలాగే, హిందీలో ఈ చిత్రానికి రూ. 2 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

మూడు రోజులకు కలిపి ఎంతంటే

మూడు రోజులకు కలిపి ఎంతంటే

సుదీప్ ‘విక్రాంత్ రోణ' చిత్రానికి రెండు రోజులకు కలిపి కర్నాటకలో రూ. 30 - 35 కోట్లు గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, మలయాళంలో రూ. 40 - 50 లక్షలు గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో రూ. 1 - 2 కోట్లు గ్రాస్, తమిళనాడులో రూ. 1 - 1.20 కోట్లు గ్రాస్ రాబట్టింది. అలాగే, హిందీలో ఈ చిత్రానికి రూ. 3 - 4 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు విశ్లేషకులు వెల్లడించారు.

ఓవర్సీస్‌లో ఎంత వచ్చిందంటే

ఓవర్సీస్‌లో ఎంత వచ్చిందంటే

కిచ్చా సుదీప్ - అనూప్ భండారి కాంబినేషన్‌లో రూపొందిన ‘విక్రాంత్ రోణ' మూవీకి ఓవర్సీస్‌లో అంతగా రాణించడం లేదని చెప్పొచ్చు. ఈ చిత్రానికి ప్రీమియర్స్ ద్వారా 19,318 డాలర్లు వచ్చాయి. అలాగే, మొదటి రోజు 43,820 డాలర్లు వసూలు అయ్యాయి. మూడు రోజులకు కలిపి మాత్రం ఈ సినిమాకు 80 వేల డాలర్లు అంటే రూ. 56 లక్షలు వసూలు అయినట్లు సమాచారం.

మూడు రోజుల్లో మొత్తం ఎంతంటే

మూడు రోజుల్లో మొత్తం ఎంతంటే

ట్రేడ్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 68 - 73 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే, ఈ చిత్రానికి రూ. 30 - 35 కోట్లు షేర్ వరకూ వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, మూడు రోజుల్లోనే ఈ సినిమాకు సగం కంటే ఎక్కువ టార్గెట్ పూర్తి అయినట్లు కూడా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X