twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vikrant Rona Telugu Collections: తెలుగులో సంచలనం.. అన్ని కోట్ల టార్గెట్ ఔట్.. 8వ సినిమాగా రికార్డు

    |

    పేరుకు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా తెలుగులోనూ మంచి గుర్తింపును, మార్కెట్‌ను సంపాదించుకున్నాడు కిచ్చా సుదీప్. గతంలో వచ్చిన 'ఈగ', 'బాహుబలి', 'సైరా: నరసింహారెడ్డి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ హీరో.. ఇప్పుడు 'విక్రాంత్ రోణ' అనే సినిమాతో వచ్చాడు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీకి అన్ని ఏరియాల్లోనూ విశేషమైన స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో కేవలం మూడు రోజుల్లోనే టార్గెట్‌ను దాటేసి క్లీన్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ' మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    విక్రాంత్ రోణగా వచ్చేసిన సుదీప్

    విక్రాంత్ రోణగా వచ్చేసిన సుదీప్


    కిచ్చా సుదీప్ - అనూప్ భండారి కలయికలో వచ్చిన అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీనే 'విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ కాగా.. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు.

    <strong>తెలుగు హీరోయిన్‌కు నెటిజన్ షాక్: నువ్వు నా లవర్‌లా ఉన్నావు.. ఆ ఫొటోలు చూపించు అంటూ!</strong><br />తెలుగు హీరోయిన్‌కు నెటిజన్ షాక్: నువ్వు నా లవర్‌లా ఉన్నావు.. ఆ ఫొటోలు చూపించు అంటూ!

    బిజినెస్‌కు తగ్గట్లే గ్రాండ్‌గా రిలీజ్

    బిజినెస్‌కు తగ్గట్లే గ్రాండ్‌గా రిలీజ్


    కిచ్చా సుదీప్ కన్నడ హీరోనే అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి తోడు విజువల్ వండర్‌గా రూపొందిన 'విక్రాంత్ రోణ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా, తెలంగాణలో కలిపి ఈ సినిమాకు రూ. 1.25 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

    మూడో రోజు ఎక్కడ ఎంతొచ్చింది

    మూడో రోజు ఎక్కడ ఎంతొచ్చింది


    'విక్రాంత్ రోణ'కు ఆంధ్రా, తెలంగాణలో 3వ రోజు కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 53 లక్షలు షేర్‌తో పాటు రూ. 1 కోట్లు గ్రాస్ వచ్చింది.

    యాంకర్ స్రవంతి ఓవర్ డోస్ ట్రీట్: ఈ డ్రెస్‌ ఏంటో.. ఆ ఫోజులేంటో.. చూస్తే షాకే!యాంకర్ స్రవంతి ఓవర్ డోస్ ట్రీట్: ఈ డ్రెస్‌ ఏంటో.. ఆ ఫోజులేంటో.. చూస్తే షాకే!

    3 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    3 రోజులకు కలిపి ఎంత వచ్చింది


    'విక్రాంత్ రోణ'కు 3 రోజుల్లో కలెక్షన్లు మంచిగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 74 లక్షలు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 18 లక్షలు, కృష్ణాలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.91 కోట్లు షేర్, రూ. 3.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

    క్రేజీ కాంబోలో వచ్చిన 'విక్రాంత్ రోణ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.50 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 1.91 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 41 లక్షలు లాభాలు కూడా వచ్చాయి.

    <strong>Mehreen Kaur Pirzada: మెహ్రీన్ అందాల విందు.. అబ్బో ఆమె డ్రెస్ చూస్తే!</strong><br />Mehreen Kaur Pirzada: మెహ్రీన్ అందాల విందు.. అబ్బో ఆమె డ్రెస్ చూస్తే!

    తెలుగులో ఎనిమిదో సినిమాగా

    తెలుగులో ఎనిమిదో సినిమాగా

    విజువల్ వండర్‌గా రూపొందిన 'విక్రాంత్ రోణ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. ఫలితంగా మూడు రోజుల్లోనే ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్ అయింది. దీంతో 2022లో 'బంగార్రాజు', 'డీజే టిల్లు', 'RRR', 'డాన్', 'కేజీఎఫ్ చాప్టర్ 2', 'మేజర్', 'విక్రమ్' తర్వాత హిట్ అయిన ఎనిమిదో సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది.

     ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు

    ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు


    కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని మూడు రోజుల్లో రూ. 68 - 73 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఈ చిత్రానికి రూ. 30 - 35 కోట్లు షేర్ వరకూ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ సినిమా హిట్ అవ్వాలంటే మరో రూ. 40 కోట్లు వరకూ వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    English summary
    Kiccha Sudeep Did Vikrant Rona Movie Under Anup Bhandari Direction. This Movie Collects 1.91 Crore Share in 3 Days in Telugu States.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X