Vikrant Rona 4 Days Collection: సుదీప్‌కు కలిసొచ్చిన సండే.. ఆ రికార్డును దాటి.. ఈ మైలురాయికి చేరువ

దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా కన్నడ చిత్ర పరిశ్రమలో హవాను చూపిస్తూ స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్నాడు కిచ్చా సుదీప్. కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తోన్న అతడు.. అన్ని వర్గాల వాళ్లు ఆదరించే హీరోగా ఎదిగిపోయాడు. దీంతో స్టార్‌డమ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీగా పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇలా గత వారమే 'విక్రాంత్ రోణ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అదిరిపోయే స్పందనతో దూసుకుపోతోంది. ఫలితంగా కలెక్షన్లను భారీగా రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ'కు నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసిందో చూడండి!

విక్రాంత్ రోణగా సుదీప్ అరాచకం

విక్రాంత్ రోణగా సుదీప్ అరాచకం

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ భండారి రూపొందించిన సినిమానే 'విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ కాగా.. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించాడు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

దక్షిణాది మొత్తంలో తనకంటూ కొంత మార్కెట్‌ను ఏర్పరచుకున్న సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా అన్ని చోట్ల మంచి ధరలకే ఇది అమ్ముడైంది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.50 కోట్లు బిజినెస్ అయినట్లు తెలిసింది.

4వ రోజు ఎంత కలెక్షన్ వచ్చింది

4వ రోజు ఎంత కలెక్షన్ వచ్చింది

కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' చిత్రానికి 4వ రోజు కర్నాటకలో రూ. 14 - 17 కోట్లు గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, మలయాళంలో రూ. 60 లక్షలు లోపు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 1 కోటి లోపు గ్రాస్, తమిళనాడులో రూ. 1 కోటి లోపు గ్రాస్ రాబట్టింది. అలాగే, హిందీలో ఈ చిత్రానికి రూ. 1.50 - 2 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

4 రోజులకు కలిపి ఎంతొచ్చింది

4 రోజులకు కలిపి ఎంతొచ్చింది

సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' చిత్రానికి 4 రోజులకు కలిపి కర్నాటకలో రూ. 60 - 65 కోట్లు గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, మలయాళంలో రూ. 60 - 90 లక్షలు గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2 - 2.50 కోట్లు గ్రాస్, తమిళనాడులో రూ. 1 - 1.80 కోట్లు గ్రాస్ రాబట్టింది. అలాగే, హిందీలో ఈ చిత్రానికి రూ. 4 - 5 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ సమాచారం.

ఓవర్సీస్‌లో ఎంత వచ్చిందంటే

ఓవర్సీస్‌లో ఎంత వచ్చిందంటే

సుదీప్ - జాక్వెలిన్ కాంబినేషన్‌లో రూపొందిన 'విక్రాంత్ రోణ' మూవీకి ఓవర్సీస్‌లో నిరాశనే ఎదుర్కొందనే చెప్పుకోవాలి. ఈ చిత్రానికి ప్రీమియర్స్ ద్వారా 19,418 డాలర్లు వచ్చాయి. అలాగే, మొదటి రోజు 44,820 డాలర్లు వసూలు అయ్యాయి. నాలుగు రోజులకు కలిపి మాత్రం ఈ సినిమాకు 1 లక్ష డాలర్లు అంటే రూ. 80 లక్షలు వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

4 రోజుల్లో షేర్ మొత్తం ఎంతంటే

4 రోజుల్లో షేర్ మొత్తం ఎంతంటే

ట్రేడ్ విశ్లేషకుల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 85 - 90 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే, ఈ చిత్రానికి రూ. 48 - 53 కోట్లు షేర్ వరకూ వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, 4 రోజుల్లోనే ఈ సినిమాకు దాదాపు 70 శాతం షేర్ వసూలు అయినట్లు తెలుస్తోంది.

50 దాటేసి.. 100కు చేరువైన మూవీ

50 దాటేసి.. 100కు చేరువైన మూవీ

4వ రోజు వచ్చిన కలెక్షన్లతో 'విక్రాంత్ రోణ' మూవీ యాభై కోట్ల రూపాయల షేర్ మార్కును దాటేసినట్లు కన్నడ ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు, గ్రాస్ పరంగా ఈ సినిమా వంద కోట్లకు కూడా చేరువైనట్లు తెలిసింది. ఇదే ఊపు కంటిన్యూ అయితే మరో మూడు నాలుగు రోజుల్లోనే ఈ సినిమా టార్గెట్‌ను దాటేసే అవకాశాలు కూడా ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X