Vikrant Rona Telugu Collections: 4వ రోజు సంచలన వసూళ్లు.. ఆ తెలుగు మూవీల కంటే ఎక్కువ.. లాభం ఎంతంటే!
సౌత్‌లో ఉన్న స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో తెలుగు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా మంది బలమైన పునాదులు వేసుకున్నారు. దీంతో మరికొందరు హీరోలు తెలుగులోనూ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇలా ఇటీవలే కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ 'విక్రాంత్ రోణ' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అదిరిపోయే స్పందనను అందుకుంది. ఫలితంగా కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ' మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

విక్రాంత్ రోణగా సుదీప్ విశ్వరూపం
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో అనూప్ భండారి తెరకెక్కించిన మూవీనే 'విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ కాగా.. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా నిర్మించారు.

బిజినెస్‌కు తగ్గట్లే గ్రాండ్‌గా రిలీజ్
కిచ్చా సుదీప్ గతంలో 'ఈగ', 'బాహుబలి', 'సైరా: నరసింహారెడ్డి' వంటి చిత్రాలతో తెలుగు వాళ్లకు బాగా దగ్గరయ్యాడు. దీంతో తాజాగా ఆయన చేసిన కన్నడ చిత్రం 'విక్రాంత్ రోణ'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 1.25 కోట్లకు అమ్ముడపోయాయి.

4వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?
ఆంధ్రా, తెలంగాణలో 'విక్రాంత్ రోణ' 4వ రోజు సంచలనం సృష్టించింది. ఫలితంగా నైజాంలో రూ. 44 లక్షలు, సీడెడ్‌లో రూ. 14 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.01 కోట్లు షేర్, రూ. 2.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

4 రోజులకు కలిపి ఎంత వచ్చింది
'విక్రాంత్ రోణ'కు 4 రోజుల్లో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 38 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 36 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 26 లక్షలు, కృష్ణాలో రూ. 22 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 2.92 కోట్లు షేర్, రూ. 5.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
విజువల్ వండర్‌గా వచ్చిన 'విక్రాంత్ రోణ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.50 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 2.92 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.42 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

తెలుగు సినిమాలకు షాకిస్తూనే
క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో వచ్చిన 'విక్రాంత్ రోణ' మూవీకి ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. ఫలితంగా తెలుగు స్టార్ హీరోల సినిమాలు 'రామారావు ఆన్ డ్యూటీ', 'థ్యాంక్యూ', 'ది వారియర్' చిత్రాలకు గట్టి షాక్ తగిలినట్లైంది. మరీ ముఖ్యంగా రవితేజ చిత్రం విక్రాంత్ రోణ వసూళ్లలో సగం మొత్తాన్ని కూడా వసూలు చేయలేకపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు
కిచ్చా సుదీప్ - అనూప్ భండారి కాంబోలో వచ్చిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని నాలుగు రోజుల్లో రూ. 85 - 90 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఈ చిత్రానికి రూ. 48 - 53 కోట్లు షేర్ వరకూ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ సినిమా ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసినట్లు కన్నడ మీడియా వెల్లడించింది.


Click it and Unblock the Notifications











