Vikrant Rona: 5వ రోజు దారుణంగా పడిపోయిన వసూళ్లు.. అయినా కోట్లలో లాభం.. ఎన్ని కోట్లు అంటే?

దక్షిణ భారతదేశంలో భారీ బడ్జెట్ చిత్రాలు గతంలో కంటే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ నుంచే ఈ తరహా సినిమాలు రూపొందుతోన్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు రాగా వాటిలో చాలా వరకూ దేశ వ్యాప్తంగా సత్తా చాటాయి, ఆ నమ్మకంతోనే వచ్చిన చిత్రం 'విక్రాంత్ రోణ'. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. అలా గత గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన భారీగానే దక్కుతోన్న నేపథ్యంలో 'విక్రాంత్ రోణ'కు నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసిందో చూద్దాం రండి!

 73.50 కోట్లు బిజినెస్

73.50 కోట్లు బిజినెస్


కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ భండారి రూపొందించిన విజువల్ వండర్ మూవీ 'విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటించగా నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 73.50 కోట్లు బిజినెస్ జరిగింది.

5వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?

5వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?


ఆంధ్రా, తెలంగాణలో 'విక్రాంత్ రోణ' 5వ రోజు వసూళ్ళలో చాలా డ్రాప్ కనిపిస్తోంది. ఈ క్రమంలో నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 0.38 కోట్లు షేర్‌, రూ.0.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

5 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

5 రోజులకు కలిపి ఎంత వచ్చింది?


'విక్రాంత్ రోణ'కు 5 రోజుల్లో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.34 కోట్లు, సీడెడ్‌లో రూ. 43 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 41 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 29 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.30 కోట్లు షేర్, రూ. 6.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?


విజువల్ వండర్‌గా వచ్చిన 'విక్రాంత్ రోణ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.50 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 3.30 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.80 కోట్లు లాభాలు కూడా వచ్చాయి. 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఐదు రోజుల్లో రూ. 72 కోట్లు షేర్ వరకూ వచ్చినట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X