For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vikrant Rona 6 Days Collection: 6వ రోజు సుదీప్‌కు షాక్.. 6 రోజుల్లో అన్ని కోట్లు.. ఇంకెంత రావాలంటే!

    |

    సుదీర్ఘ కాలంగా కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా వెలుగొందుతూ తనదైన చిత్రాలతో ప్రత్యేకమైన ముద్రను వేసుకుంటున్నాడు కిచ్చా సుదీప్. కెరీర్ ఆరంభం నుంచీ వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో సత్తా చాటుతోన్న ఈ సీనియర్ హీరో.. చాలా కాలంగా సరైన హిట్‌ను మాత్రం ఖాతాలో వేసుకోలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'విక్రాంత్ రోణ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ విశేషమైన స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం కలెక్షన్లను అత్యధిక స్థాయిలో రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ' చిత్రానికి ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్షన్ వచ్చిందో మీరే చూడండి!

    విక్రాంత్ రోణగా వచ్చేసిన సుదీప్

    విక్రాంత్ రోణగా వచ్చేసిన సుదీప్

    కిచ్చా సుదీప్ - అనూప్ భండారి కలయికలో వచ్చిన విజువల్ వండర్ ఫిల్మే 'విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ కాగా.. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూర్చాడు.

    మేకప్ రూంలో తెలుగు హీరోయిన్ హాట్ ట్రీట్: ఆ పార్ట్‌లను హైలైట్ చేస్తూ!

    బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

    బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

    పేరుకు కన్నడ హీరోనే అయినా కిచ్చా సుదీప్‌కు దక్షిణాది మొత్తంలోనూ మార్కెట్ ఉంది. దీనికితోడు 'విక్రాంత్ రోణ' మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడింది. ఫలితంగా అన్ని చోట్ల మంచి ధరలకే ఇది అమ్ముడైంది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.50 కోట్లు బిజినెస్ అయినట్లు సమాచారం.

    6వ రోజు ఎంత కలెక్షన్ వచ్చింది

    6వ రోజు ఎంత కలెక్షన్ వచ్చింది

    కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' చిత్రానికి 6వ రోజు కర్నాటకలో రూ. 3 - 3.50 కోట్లు గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, మలయాళంలో రూ. 10 లక్షలు లోపు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 లక్షల లోపు గ్రాస్, తమిళనాడులో రూ. 20 లక్షల లోపు గ్రాస్ రాబట్టింది. అలాగే, హిందీలో ఈ చిత్రానికి రూ. 30 - 50 లక్షలు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

    విచిత్రమైన డ్రెస్‌లో జాన్వీ కపూర్ రచ్చ: వామ్మో మరీ ఇంత దారుణమా!

    6 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    6 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' చిత్రానికి 6 రోజులకు కలిపి కర్నాటకలో రూ. 70 - 73 కోట్లు గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, మలయాళంలో రూ. 1 - 1.50 కోట్లు గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 - 5.50 కోట్లు గ్రాస్, తమిళనాడులో రూ. 2 - 2.80 కోట్లు గ్రాస్ రాబట్టింది. అలాగే, హిందీలో ఈ చిత్రానికి రూ. 5 - 6 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ సమాచారం.

    ఓవర్సీస్‌లో ఎంత వచ్చిందంటే

    ఓవర్సీస్‌లో ఎంత వచ్చిందంటే

    సుదీప్ - జాక్వెలిన్ ఫెర్నాడెజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'విక్రాంత్ రోణ' మూవీకి ఓవర్సీస్‌లో అంతగా రెస్పాన్స్ రావడం లేదు. ఈ చిత్రానికి ప్రీమియర్స్ ద్వారా 19,418 డాలర్లు వచ్చాయి. అలాగే, మొదటి రోజు 44,820 డాలర్లు వసూలు అయ్యాయి. ఆ తర్వాత కలిపి మాత్రం ఈ సినిమాకు 1.40 లక్ష డాలర్లు అంటే రూ. 1.12 కోట్లు వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

    టాప్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ లహరి: తొలిసారి ఓ రేంజ్‌లో అందాల ఆరబోత

    6 రోజుల్లో షేర్ మొత్తం ఎంతంటే

    6 రోజుల్లో షేర్ మొత్తం ఎంతంటే


    ట్రేడ్ లెక్కల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 100 - 104 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే, ఈ చిత్రానికి రూ. 51 - 55 కోట్లు షేర్ వరకూ వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, 6 రోజుల్లోనే ఈ సినిమాకు దాదాపు 80 శాతం షేర్ వసూలు అయినట్లు తెలుస్తోంది.

    ఇంకెంత వస్తే హిట్ అవుతుంది?

    ఇంకెంత వస్తే హిట్ అవుతుంది?

    క్రేజీ కాంబినేషన్‌లో విజువల్ వండర్‌గా వచ్చిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.50 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 75 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ చిత్రం 6 రోజుల్లోనే రూ. 51 - 55 కోట్ల షేర్‌ను రాబట్టింది. అంటే మరో రూ. 20 కోట్లు వసూలు చేస్తేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుంటుందని తెలిసింది.

    English summary
    Kiccha Sudeep Did Vikrant Rona Movie Under Anup Bhandari Direction. This Movie Collects 100 - 104 Crore gross in 6 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X