Vikrant Rona Telugu Collections: తెలుగులో వసూళ్లు డౌన్.. 6 రోజుల్లో ఊహించనిలా.. లాభమే అన్ని కోట్లు
దక్షిణాదికి చెందిన చాలా మంది హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగేందుకు తెగ కష్టాలు పడుతున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించారు. ఈ క్రమంలోనే కన్నడ పరిశ్రమకు చెందిన కిచ్చా సుదీప్ ఇటీవలే 'విక్రాంత్ రోణ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐదు భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి తెలుగులో మాత్రమే భారీ స్పందన దక్కుతోంది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ విజువల్ వండర్ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా దాటేసింది. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ' సినిమా ఆరు రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇప్పటికి ఎన్ని కోట్ల లాభాలను రాబట్టింది? అనే విషయాలు చూద్దాం పదండి!

విక్రాంత్ రోణగా సుదీప్ అరాచకం
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ భండారి తెరకెక్కించిన మూవీనే 'విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ కాగా.. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ ప్రొడ్యూస్ చేశారు.

బిజినెస్‌కు తగ్గట్లే గ్రాండ్‌గా రిలీజ్
గతంలో 'ఈగ', 'బాహుబలి', 'సైరా: నరసింహారెడ్డి' వంటి చిత్రాలతో కిచ్చా సుదీప్ తెలుగు వాళ్లకు బాగా సుపరిచితుడు అయ్యాడు. దీంతో తాజాగా ఆయన చేసిన కన్నడ చిత్రం 'విక్రాంత్ రోణ'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 1.25 కోట్లకు అమ్ముడయ్యాయి.

6వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినా 'విక్రాంత్ రోణ' మూవీకి అన్ని ఏరియాల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతోంది. అయితే, సోమవారం నుంచి వసూళ్లు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఆరో రోజు రూ. 24 లక్షలు షేర్, 50 లక్షలు గ్రాస్ వచ్చింది.

6 రోజులకు కలిపి ఎంత వచ్చింది
6 రోజుల్లో 'విక్రాంత్ రోణ'కు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 46 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 44 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 31 లక్షలు, కృష్ణాలో రూ. 26 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.54 కోట్లు షేర్, రూ. 7.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'విక్రాంత్ రోణ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.50 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 3.54 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.04 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు
కిచ్చా సుదీప్ - అనూప్ భండారి కలయికలో రూపొందిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఆరు రోజుల్లో రూ. 100 - 104 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఈ చిత్రానికి రూ. 54 - 58 కోట్లు షేర్ వరకూ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ సినిమా ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











