Vikrant Rona 8 Days Collection: భారీగా పడిపోయిన వసూళ్లు.. తొలిసారి ఇంత తక్కువ.. టోటల్ ఎంతంటే!
పేరుకు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. సౌతిండియా మొత్తంలో తనదైన మార్కును చూపిస్తూ విశేషమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు కిచ్చా సుదీప్. ఈ కారణంగానే కొంత కాలంగా తన చిత్రాలను దక్షిణాది భాషల్లోకి కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాడు. తద్వారా తన మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సుదీప్ 'విక్రాంత్ రోణ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ' 8 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

విక్రాంత్ రోణగా వచ్చేసిన సుదీప్
శాండిల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ భండారి తీసిన విజువల్ వండర్ ఫిల్మే ‘విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ కాగా.. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా నిర్మించారు.దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూర్చాడు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్
కిచ్చా సుదీప్ ఈ మధ్య కాలంలో భారీ చిత్రాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్నాడు. దీనికితోడు ‘విక్రాంత్ రోణ' మూవీపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడింది. ఫలితంగా అన్ని చోట్ల మంచి ధరలకే ఇది అమ్ముడైంది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.50 కోట్లు బిజినెస్ జరిగింది.

8వ రోజు ఎంత కలెక్షన్ వచ్చింది
కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ' చిత్రానికి 8వ రోజు కర్నాటకలో రూ. 1 - 1.10 కోట్లు గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, మలయాళంలో రూ. 5 లక్షలు లోపు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 లక్షల లోపు గ్రాస్, తమిళనాడులో రూ. 20 లక్షల లోపు గ్రాస్ రాబట్టింది. అలాగే, హిందీలో ఈ చిత్రానికి రూ. 30 లక్షలు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
Recommended Video


8 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ' చిత్రానికి 8 రోజులకు కలిపి కర్నాటకలో రూ. 76 - 78 కోట్లు గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, మలయాళంలో రూ. 50 - 70 లక్షలు గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.50 - 8 కోట్లు గ్రాస్, తమిళనాడులో రూ. 3.20 - 3.50 కోట్లు గ్రాస్ రాబట్టింది. అలాగే, హిందీలో ఈ చిత్రానికి రూ. 8 - 9 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ సమాచారం.

ఓవర్సీస్‌లో ఎంత వచ్చిందంటే
సుదీప్ - అనూప్ భండారి కాంబినేషన్‌లో రూపొందిన ‘విక్రాంత్ రోణ' మూవీకి ఓవర్సీస్‌లో అంతగా రెస్పాన్స్ రావడం లేదు. ఈ చిత్రానికి ప్రీమియర్స్ ద్వారా 19,418 డాలర్లు వచ్చాయి. అలాగే, మొదటి రోజు 44,820 డాలర్లు వసూలు అయ్యాయి. ఆ తర్వాత కలిపి మాత్రం ఈ సినిమాకు 1.70 లక్ష డాలర్లు అంటే రూ. 1.36 కోట్లు వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

8 రోజుల్లో షేర్ మొత్తం ఎంతంటే
ట్రేడ్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 110 - 112 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే, ఈ చిత్రానికి రూ. 57 - 59 కోట్లు షేర్ వరకూ వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, 8 రోజుల్లోనే ఈ సినిమాకు దాదాపు 85 శాతం షేర్ వసూలు అయినట్లు తెలుస్తోంది.

ఇంకెంత వస్తే హిట్ అవుతుంది?
భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా వచ్చిన ‘విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.50 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 75 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే రూ. 57 - 59 కోట్ల షేర్‌ను రాబట్టింది. అంటే మరో రూ. 16 కోట్లు వసూలు చేస్తేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications











