Vikrant Rona Telugu Collections: 8వ రోజు మరింత డౌన్.. అయినా కోట్ల లాభం.. టోటల్ రిపోర్ట్ చూస్తే!
తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రియులు భాషతో సంబంధం లేకుండా ఎలాంటి సినిమానైనా బాగుంటే ఆదరిస్తూ ఉంటారు. అలాగే, ఏ ఇండస్ట్రీకి చెందిన హీరో అయినా.. చక్కని యాక్టింగ్ చేస్తే అక్కున చేర్చుకుంటారు. ఇలా ఇప్పటికే చాలా పరిశ్రమలకు చెందిన హీరోలు టాలీవుడ్‌లో మార్కెట్‌ను ఏర్పరచుకుని సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు కిచ్చా సుదీప్. ఆయన నటించిన 'విక్రాంత్ రోణ' ఇటీవలే విడుదలైంది. దీనికి తెలుగులో భారీ రెస్పాన్స్ రావడంతో సూపర్ హిట్ అయింది. దీంతో అప్పుడే లాభాలు కూడా దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ' సినిమా 8 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!
Recommended Video


విక్రాంత్ రోణగా సుదీప్ వచ్చాడు
కన్నడ స్టార్ సుదీప్ హీరోగా అనూప్ భండారి రూపొందించిన సినిమానే ‘విక్రాంత్ రోణ'. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ దీన్ని నిర్మించారు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటించింది. అలాగే, నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు.

బిజినెస్‌కు తగ్గట్లే గ్రాండ్‌గా రిలీజ్
కిచ్చా సుదీప్ గతంలో ‘ఈగ', ‘బాహుబలి', ‘సైరా: నరసింహారెడ్డి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. దీంతో తాజాగా ఆయన చేసిన కన్నడ చిత్రం ‘విక్రాంత్ రోణ'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 1.25 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

8వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?
ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని.. ఇటీవలే విడుదలైన చిత్రం ‘విక్రాంత్ రోణ'. సుదీప్ నటించిన ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్పందన లభించింది. దీంతో ఇక్కడ కలెక్షన్లు అత్యధిక మొత్తంలో వసూలు అవుతున్నాయి. అయితే, ఇప్పుడు క్రమంగా పడిపోతోన్నాయి. దీంతో 8వ రోజు రూ. 14 లక్షలు షేర్, 25 లక్షలు గ్రాస్ వచ్చింది.

8 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
8 రోజుల్లో ‘విక్రాంత్ రోణ'కు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 50 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 48 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, గుంటూరులో రూ. 34 లక్షలు, కృష్ణాలో రూ. 29 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.85 కోట్లు షేర్, రూ. 7.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రాంత్ రోణ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.50 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 3.85 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.35 కోట్లు లాభాలు దక్కాయి.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు
కిచ్చా సుదీప్ - అనూప్ భండారి కాంబోలో వచ్చిన ‘విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఆరు రోజుల్లో రూ. 110 - 112 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఈ చిత్రానికి రూ. 53 కోట్లు పైగానే షేర్ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ సినిమా ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసి ప్రపంచ వ్యాప్తంగా హవాను చూపిస్తోంది.


Click it and Unblock the Notifications











