Don't Miss!
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Automobiles ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Vikrant Rona Telugu Collections: 9వ రోజు భారీ దెబ్బ.. ఆ రికార్డుకు చేరువ.. లాభమే అన్ని కోట్లు
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అందులోనూ తెలుగులో మార్కెట్‌ను పెంచుకోడానికి చాలా మంది దక్షిణాది హీరోలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టాలీవుడ్లో ఎన్నో డబ్బింగ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. అలా గత వారంలో విడుదలైన సినిమానే 'విక్రాంత్ రోణ'. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా వెలుగొందుతూ.. తెలుగు వాళ్లకు కూడా సుపరిచితుడు అయిన కిచ్చా సుదీప్ నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. దీనికి తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడు రోజుల్లోనే టార్గెట్‌ను చేరుకుని లాభాల బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ' సినిమా 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
విక్రాంత్ రోణగా సుదీప్ వచ్చాడు
కిచ్చా సుదీప్ - అనూప్ భండారి కలయికలో వచ్చిన విజువల్ వండర్ మూవీనే 'విక్రాంత్ రోణ'. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ దీన్ని నిర్మించారు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా చేసింది. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఇచ్చాడు.
'ఖిలాడి' హీరోయిన్ హాట్ వీడియో వైరల్: లోదుస్తులు కూడా తీసేసి ఘోరంగా!
బిజినెస్‌కు తగ్గట్లే గ్రాండ్‌గా రిలీజ్
ఇప్పటికే కిచ్చా సుదీప్ 'ఈగ', 'బాహుబలి', 'సైరా: నరసింహారెడ్డి' వంటి చిత్రాలతో తెలుగులో సందడి చేశాడు. దీంతో తాజాగా ఆయన చేసిన కన్నడ చిత్రం 'విక్రాంత్ రోణ'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు రూ. 1.25 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
9వ రోజు ఎక్కడ ఎంత వచ్చింది?
విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకున్న 'విక్రాంత్ రోణ' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊహించని రీతిలో స్పందన లభించింది. దీంతో ఇక్కడ కలెక్షన్లు అత్యధిక మొత్తంలో వస్తున్నాయి. అయితే, ఈ వారం నుంచి వసూళ్లు క్రమంగా పడిపోతోన్నాయి. దీంతో 9వ రోజు కేవలం ఈ సినిమాకు రూ. 7 లక్షలు షేర్, 15 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.
షర్ట్ విప్పేసి మరీ సమీరా రెడ్డి అందాల ఆరబోత: ఎన్టీఆర్ హీరోయిన్ ఇలా మారిందేంటి!
9 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
'విక్రాంత్ రోణ'కు 9 రోజుల్లో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 50 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 49 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 34 లక్షలు, కృష్ణాలో రూ. 30 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.88 కోట్లు షేర్, రూ. 7.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభమెంత?
విజువల్ వండర్‌గా వచ్చిన 'విక్రాంత్ రోణ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.50 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 3.88 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.38 కోట్లు లాభాలు దక్కాయి.
డ్రెస్ తీసేసి మరీ కరీనా కపూర్ రచ్చ: అబ్బో ఆ ఫోజు చూశారంటే!
ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు
కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ భండారి తీసిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఆరు రోజుల్లో రూ. 112 - 114 కోట్లు గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఈ చిత్రానికి రూ. 55 కోట్లు పైగానే షేర్ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ సినిమా ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసి ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తోంది.