Vikrant Rona Day 1 Collection: సుదీప్ మూవీకి ఊహించని వసూళ్లు.. తొలి రోజే కేజీఎఫ్ రికార్డులు బ్రేక్

సుదీర్ఘ కాలంగా కన్నడ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్నాడు కిచ్చా సుదీప్. కెరీర్ ఆరంభంలోనే విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో విశేషమైన గుర్తింపును, భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో అన్ని ప్రాంతాల్లోనూ మార్కెట్‌ను పెంచుకుని దూసుకుపోతోన్నాడు. ఇక, ఈ మధ్య పెద్దగా రాణించని సుదీప్ ఇప్పుడు 'విక్రాంత్ రోణ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. విజువల్ వండర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ'కు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు ఏ రేంజ్‌లో వచ్చాయి అనేది చూద్దాం పదండి!

విక్రాంత్ రోణగా ఎంటరైన సుదీప్

విక్రాంత్ రోణగా ఎంటరైన సుదీప్

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ భండారి తెరకెక్కించిన చిత్రమే 'విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ కాగా.. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని ఇచ్చాడు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

దక్షిణాది మొత్తంలో సుదీప్‌కు మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు 'విక్రాంత్ రోణ' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలు, భాషలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 73.50 కోట్లు బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఇది ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.

అలాంటి టాక్.. కలెక్షన్లు భారీగానే

అలాంటి టాక్.. కలెక్షన్లు భారీగానే

భారీ అంచనాలతో 'విక్రాంత్ రోణ' మూవీ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఓవరాల్‌గా మంచి టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా సాయంత్రం నుంచి ఈ సినిమా భారీ స్థాయిలో పుంజుకుంది. దీంతో ఈ మూవీకి ఓపెనింగ్ కలెక్షన్లు బాగానే వస్తాయని సినీ విశ్లేషకులు అంచనాలు వేసిన విషయం తెలిసిందే.

ఏ ఏరియాలో ఎంత వసూలైంది

ఏ ఏరియాలో ఎంత వసూలైంది

కిచ్చా సుదీప్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'విక్రాంత్ రోణ'కు మొదటి రోజు కర్నాటకలో రూ. 25 - 27 కోట్లు గ్రాస్ వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, మలయాళంలో రూ. 1 - 2 కోట్లు గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2 - 2.50 కోట్లు గ్రాస్, తమిళనాడులో రూ. 2 - 3 కోట్లు గ్రాస్ రాబట్టింది. అలాగే, హిందీలో ఈ చిత్రానికి రూ. 2 - 3 కోట్లు గ్రాస్ వసూలు అయిందని ట్రేడ్ సమాచారం.

ఓవర్సీస్‌లో ఎంత వచ్చిందంటే

ఓవర్సీస్‌లో ఎంత వచ్చిందంటే

'విక్రాంత్ రోణ' మూవీకి ఓవర్సీస్‌లో కాస్త స్లో స్టార్ట్ వచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రానికి ప్రీమియర్స్ ద్వారా 19,318 డాలర్లు వచ్చాయి. అలాగే, మొదటి రోజు 23,125 డాలర్లు వసూలు అయ్యాయి. ఇక, మిగిలిన విదేశాల్లోని అన్ని ప్రాంతాలను కలుపుకుని ఈ చిత్రానికి ఫస్ట్ డే 43,820 డాలర్లు వసూలు అయ్యాయి. అంటే ఓవర్సీస్‌లో మొత్తంగా రూ. 34.86 లక్షలు కలెక్ట్ చేసింది.

మొదటి రోజు మొత్తం ఎంతంటే

మొదటి రోజు మొత్తం ఎంతంటే

ఇప్పటి వరకూ అందుతోన్న సమాచారం ప్రకారం.. సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 40 - 45 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే, ఈ చిత్రానికి రూ. 20 కోట్లు షేర్ వరకూ వచ్చినట్లు తెలిసింది. ఇది కిచ్చా సుదీప్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని తెలుస్తోంది. ఇక, ఈ వసూళ్లతో పలు రికార్డులు కూడా బ్రేక్ అయ్యాయి.

కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టేసి

కేజీఎఫ్ రికార్డును బద్దలు కొట్టేసి


'విక్రాంత్ రోణ' మూవీ కర్నాటకలో మొదటి రోజు రూ. 25 కోట్ల గ్రాస్ వరకూ రాబట్టింది. తద్వారా కేజీఎఫ్ చాప్టర్ 1 రికార్డును బద్దలు కొట్టేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో మూడో స్థానానికి చేరింది. ఇందులో 'కేజీఎఫ్ చాప్టర్ 2' మొదటి స్థానంలో, 'జేమ్స్' రెండో స్థానంలో ఉన్నాయి. ఓవరాల్‌లో ఎక్కువ గ్రాస్ రాబట్టిన చిత్రాల్లో మాత్రం ఇది ఏకంగా రెండో స్థానంలో నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X