Vikrant Rona Telugu Collections: తెలుగులో షాకింగ్ వసూళ్లు.. ఒక్కరోజే ఇంతా.. ఇంకెంత రావాలంటే!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతోన్నాయి. అక్కడి చిత్రాలకు దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోండడంతో దర్శక నిర్మాతలు, హీరోలు ధైర్యంగా ముందుకు వచ్చి పాన్ ఇండియా మూవీలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు సినిమాలు వచ్చి సందడి చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన సినిమానే 'విక్రాంత్ రోణ'. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా వెలుగొందుతోన్న సుదీప్ నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో 'విక్రాంత్ రోణ'కు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో మీరే చూడండి!

విక్రాంత్ రోణగా వచ్చిన స్టార్ హీరో
కిచ్చా సుదీప్ - అనూప్ భండారి కాంబినేషన్‌లో వచ్చిన అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీనే 'విక్రాంత్ రోణ'. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ కాగా.. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్లపై శాలినీ జాక్ మంజు, అలంకార్ పాండియన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు.

బిజినెస్‌కు తగ్గట్లే గ్రాండ్‌గా రిలీజ్
కన్నడంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు కూడా కిచ్చా సుదీప్ సుపరిచితుడే అన్న విషయం తెలిసిందే. దీనికితోడు 'విక్రాంత్ రోణ' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం తెలుగులోనూ భాగానే పోటీ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమాకు క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 1.25 కోట్లు బిజినెస్ జరిగింది.

అలాంటి టాక్.. తెలుగులో కూడా
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ 'విక్రాంత్ రోణ' గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తెలుగులో కూడా అలాంటి టాకే దక్కింది. దీంతో ఈ సినిమా కూడా అనుకున్నట్లుగా కలెక్షన్లను రాబట్టలేదని అంతా అనుకున్నారు. అయితే, సాయంత్రం నుంచి రెస్పాన్స్ పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది
'విక్రాంత్ రోణ'కు ఆంధ్రా, తెలంగాణలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 41 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.02 కోట్లు షేర్, రూ. 1.95 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి భారీ స్థాయిలో రూ. 1.02 కోట్లు వచ్చాయి. అంటే మరో 48 లక్షలు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్ అందుకుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు
ట్రేడ్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. సుదీప్ నటించిన 'విక్రాంత్ రోణ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 40 - 45 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అలాగే, ఈ చిత్రానికి రూ. 20 కోట్లు షేర్ వరకూ వచ్చినట్లు తెలిసింది. ఇది కిచ్చా సుదీప్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని తెలుస్తోంది. ఈ వసూళ్లతో పలు రికార్డులు బద్దలయ్యాయి.


Click it and Unblock the Notifications











