రవితేజ, ఇలియానా కాంబినేషన్లో సురేంద్రరెడ్డి రూపొందించిన కిక్ సినిమా క్లిక్ అయింది అనిపించుకోవాలంటే ఇరవై కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేయాలని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రాన్ని బడ్జెట్ పరంగా స్వేచ్చ తీసుకుని ఇరవై చిల్లర దాకా ఖర్చు పెట్టారని, మినిమం నెల దాకా వరస హౌస్ ఫుల్స్ అయితే వాటిని రాబట్టవచ్చునని అంచనా. ఇక ఇప్పటికే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం స్టడీగానే ఉన్నాయి. కథ, కథనాలు ఎలా ఉన్నా ఫస్టాఫ్ కామెడీ జనాలకు బాగానే కిక్కు ఇస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఆర్.ఆర్.క్రియేషన్స్ లో పెద్ద బడ్జెట్ సినిమా ఇదే కావటంతో నిర్మాతలు ఎప్పటికప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ని లెక్కలు రాబట్టి ఎంత రేంజి హిట్ అన్నది లెక్కలు వేస్తున్నారని సమాచారం. అలాగే సహనిర్మాత అచ్చిరెడ్డి ఇప్పటికే ఈ సినిమా హిట్ అని పబ్లిసిటీ ప్రారంభించేసారు. రవితేజ మాత్రం కూల్ గా ఆంజనేయులు చిత్రం షూటింగ్ నిమిత్తం యూరప్ వెళ్ళారు.