కలెక్షన్స్ సునామీ అంటే ఇదే
ముంబై : ఓ స్టార్ హీరో సినిమాకి సరైన కథ పడితే భాక్సాఫీస్ వద్ద ఆ కలెక్షన్స్ జోరుని అంచనావేయటం చాలా కష్టం. ఇప్పుడు అదే హిందీ కిక్ రీమేక్ కి జరుగుతోంది.
సల్మాన్ ఖాన్ నటించిన 'కిక్' వసూళ్లతో బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే దాదాపు రూ.83 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్ కు ఆశ్చర్యపోకపోయినా ట్రేడ్ వర్గాలు సల్మాన్ స్టామినాని చూసి నోరు వెళ్లబెట్టి చూస్తున్నారు. ఇది తెలుగులో రవితేజ హీరోగా నటించిన 'కిక్'కి రీమేక్.
తెలుగు కిక్‌కి దర్శకత్వం వహించిన సురేందర్‌రెడ్డికి మాత్రం హిందీ 'కిక్' పట్ల అసంతృప్తి మిగిల్చిందట. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. ''హిందీ కిక్ చూశాను. తెలుగు కిక్‌లోని విషయాన్ని అర్థం చేసుకొని ఈ సినిమా తెరకెక్కించి ఉంటే సల్మాన్ ఖాతాలో భారీ విజయం దక్కేది. మాతృకకు, సల్మాన్‌ఖాన్‌కి అసలు న్యాయం జరగలేదనిపించింది'' అని రాశారు.

చిత్రం రిలీజ్ కు ముందే రకరకాల అంచనాలు విశ్లేషకులు వేసారు...అవి ఇప్పుడు నిజం అవుతున్నాయి.'కిక్' రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్‌ని సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ అభిప్రాయపడ్డారు. రూ. 30 కోట్ల ఓపెనింగ్స్‌ను అది సునాయాసంగా అందుకుంటుందనీ, దీనికి కారణం ఆ సినిమా ఇంటర్నేషనల్ లుక్స్‌తో కనిపించడమేననీ ఆయన అన్నారు. ఆయన అభిప్రాయాన్ని మరో విశ్లేషకుడు కోమల్ నహతా బలపరుస్తూ ఓపెనింగ్స్ విషయంలో 'ధూమ్ 3'ని 'కిక్' ఖచ్చితంగా దాటుతుందనీ, మొదటి రోజు రూ. 35 కోట్లను సాధిస్తుందనీ అంచనా వేశారు. అంతేకాదు, ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 300 కోట్ల మార్క్‌ను అందుకుంటుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











