Kill 3 days collections: ఓ వైపు కల్కిరికార్డు వసూళ్లు.. మరోవైపు కిల్ కలెక్షన్ల వర్షం, 3 రోజుల్లో ఎంతంటే?
దేశవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ సినిమా ప్రభంజనం సృష్టిస్తూ రికార్డు కలెక్షన్లు రాబడుతుంటే.. మరో వైపు ఓ చిన్న సినిమా ఉత్తరాదిలో తన సత్తాను చాటుతున్నది. ఇలాంటి సినిమా ఒకటి రిలీజ్ అయిందా అనే సమాచారం లేకుండా థియేటర్‌లోకి వచ్చిన ఈ మూవీ.. భారీగా వసూళ్లు రాబడుతున్నది. అయితే కల్కి సునామీలోను కోట్లు రాబడుతున్న ఈ సినిమా ఏంటి? తొలివారాంతం ఎన్ని కోట్లు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం సోషల్ మీడియాలోను, అలాగే క్రిటిక్స్ ప్రశంసలు అందుకొంటున్న చిత్రం కిల్ (Kill). హిందీ సినిమా రంగంలో ప్రముఖ నిర్మాత సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై కరణ్ జోహర్, అపూర్వ మెహతా, గునీత్ మోంగ కపూర్ నిర్మించిన చిత్రం కిల్. నిఖిల్ నాగేశ్ భట్ రూపొందించిన ఈ సినిమాలో లక్ష్య, రాఘవ్ జుయల్, ఆశీష్ విద్యార్థి, హర్ష ఛాయ, తన్య మాణిక్‌తాలా తదితరులు నటించారు. జూలై 5వ తేదీన (Kill Release date) ఈ యాక్షన్, థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కిల్ సినిమా బడ్జెట్ (Kill Budget) విషయానికి వస్తే.. ఎక్కువగా నూతన నటీనటులు, కొత్త టెక్నిషియన్స్‌తో ఓ ప్రయోగమే చేశారు. ఈ సినిమా కథంతా ఓ ట్రైన్ చుట్టూ తిరుగుతుంటుంది. దాంతో ఈ సినిమా కొంత రిచ్‌గా, కథ డిమాండ్ చేయడంతో భారీగా మూవీని రూపొందించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 15 కోట్ల రూపాయల మేర అయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
దేశవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకొంటున్న కిల్ సినిమా కథేంటి (Kill Movie Story) అనే వివరాల్లోకి వెళితే.. భారత సైన్యంలో పనిచేసే జవాన్ అమ్రిత్ రాథోడ్ (లక్ష్య). తన ప్రేయసి ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా దోపిడి దొంగలు హైజాక్ చేస్తారు. ఆ ఘటనలో అమ్రిత్ ప్రేయసిని దొపిడి దొంగ ఫణి (రాఘవ్ జుయల్) దారుణంగా చంపేస్తాడు.దాంతో అమ్రిత్ జీవితం మరో టర్న్ తిరుగుతుంది. ఫణి తండ్రి బేణి (ఆశీష్ విద్యార్థి) తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. అయితే అమ్రిత్ రాథోడ్ ఫణిపై ప్రతీకారం తీర్చుకొన్నాడా? ఈ కథకు ముగింపు అనేది సినిమా కథ.
ఇక కిల్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు కల్కి కలెక్షన్ల హవాలో ఈ సినిమా పెద్దగా వసూళ్లు రాబట్టలేదు. కానీ రివ్యూలు పాజిటివ్‌గా రావడంతో రెండో రోజు నుంచి కలెక్షన్లు ఊపందుకొన్నాయి. తొలి రోజు 1.35 కోట్లు, రెండో రోజు 2.20 కోట్లు, మూడో రోజు 2.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 3 రోజుల్లో 6.35 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











