Kill Movie Collections: 15 కోట్ల బడ్జెట్.. కల్కి సునామీని ఎదురిస్తున్న కిల్.. 2 రోజుల్లో కలెక్షన్లు ఎంతంటే?
హిందీ సినిమా రంగంలో ప్రముఖ నిర్మాత సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై కరణ్ జోహర్, అపూర్వ మెహతా, గునీత్ మోంగ కపూర్ నిర్మించిన చిత్రం కిల్. నిఖిల్ నాగేశ్ భట్ రూపొందించిన ఈ సినిమాలో లక్ష్య, రాఘవ్ జుయల్, ఆశీష్ విద్యార్థి, హర్ష ఛాయ, తన్య మాణిక్‌తాలా తదితరులు నటించారు. జూలై 5వ తేదీన రిలీజైన ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కథ, కథనాలను పక్కాగా రూపొందిన కిల్ సినిమాలో ఎక్కువగా నూతన నటీనటులు, కొత్త టెక్నిషియన్స్‌తో ఓ ప్రయోగమే చేశారు. ఈ సినిమా కథంతా ఓ ట్రైన్ చుట్టూ తిరుగుతుంటుంది. దాంతో ఈ సినిమా కొంత రిచ్‌గా, కథ డిమాండ్ చేయడంతో భారీగా మూవీని రూపొందించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 15 కోట్ల రూపాయల మేర అయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

2023 సంవత్సరంలో టొరెంటో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించడంతో అంతర్జాతీయ సినిమా ప్రముఖుల దృష్టిపడింది. ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయకుండా తక్కువ స్క్రీన్లలోనే రిలీజ్ చేశారు. ఇండియాలో సుమారుగా 400 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ సినిమాను హాలీవుడ్ సూపర్ స్టార్ జాన్ విక్ హాలీవుడ్‌లో రీమేక్ చేయాలని నిర్ణయించుకోవడంతో ఈ సినిమాపై బజ్ పెరిగింది.
కిల్ కథ (Kill Story) విషయానికి వస్తే.. అమ్రిత్ రాథోడ్ (లక్ష్య) ఓ జవాన్. తాను, తన ప్రేయసి ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా దోపిడి దొంగలు హైజాక్ చేస్తారు. ఆ ఘటనలో అమ్రిత్ ప్రేయసిని దొపిడి దొంగ ఫణి (రాఘవ్ జుయల్) దారుణంగా చంపేస్తాడు.దాంతో అమ్రిత్ జీవితం మరో టర్న్ తిరుగుతుంది. ఫణి తండ్రి బేణి (ఆశీష్ విద్యార్థి) తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. అయితే అమ్రిత్ రాథోడ్ ఫణిపై ప్రతీకారం తీర్చుకొన్నాడా? ఈ కథకు ముగింపు అనేది సినిమా కథ.
కిల్ మూవీకి పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో ఓపెనింగ్స్ తక్కువగా ఉండటం, అలాగే సినిమా వచ్చిందనే విషయం కూడా పెద్దగా తెలియలేదు. ఈ సినిమాకు పూణే, చెన్నై, జైపూర్, బెంగళూరులో మంచి స్పందన, ఆక్యుపెన్సీ లభిస్తుంది.

ఇక కిల్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ ఓ మోస్తారు కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించింది. తొలి రోజు 1.35 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా రెండు రోజుల్లోనే 3.55 కోట్ల రూపాయలు రాబట్టింది. తొలివారాంతం తర్వాత భారీగా కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











