నాగార్జున నటించిన కింగ్ సినిమా శాటిలైట్ రికార్డ్ రేటుకు అమ్ముడయిందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ హాట్ టాపిక్ గా మారింది.నాగ్ సొంత ఛానెల్ మాటీవీని కూడా కాదని పోటీకి వచ్చిన జెమిని టీవి వారికి 4.8 కోట్లకు ఈ సినిమాని ఇచ్చేసారు. అయితే ఈ క్రెడిట్ నాగార్జునదా..లేక వరస హిట్లు కొడుతున్న శ్రీను వైట్లదా అనేది మాత్రం తేలకుండా ఉంది. కానీ క్రెడిట్ మాత్రం ఈ కాంబినేషన్ దే అని చెప్పవచ్చు. డిసెంబర్ 18న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రంలో నాగార్జున డబుల్ రోల్స్ లో చేస్తూ మూడు పాత్రలుగా కనిపిస్తూంటాడని తెలుస్తోంది. ఇక మొన్న ఒకటివ తేదీన రిలీజైన కింగ్ ఆడియో ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. అందుకే కింగ్ చిత్రాన్ని కింగ్ అన్నది.