Kingdom Advance Booking Report: ఓవర్సీస్‌లో కింగ్డమ్ అడ్వాన్స్ బుకింగ్.. విజయ్ దేవరకొండ మూవీకి ఎన్ని కోట్లంటే?
యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్, జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్ వరల్డ్ వైడ్‌గా ప్రారంభమైంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీని భారీగా విదేశాల్లో పలు చోట్ల చిత్రీకరించారు. ఈ సినిమాను సుమారుగా 130 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించినట్టు నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 52 కోట్ల మేర జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 54 కోట్లు షేర్.. 108 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సితారా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాను నార్త్ అమెరికాలో శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్లు జూలై 30 తేదీన ప్రారంభం కానున్నాయి. దాంతో ఈ సినిమా అమెరికాలో డీసెంట్ అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 336 లోకేషన్లలో సుమారుగా 900 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు అని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.
కింగ్డమ్ మూవీ ట్రైలర్‌ను ఇటీవల తిరుపతిలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత అడ్వాన్స్ బుకింగ్ ఊపందుకొన్నది. అమెరికాలో ఈ సినిమాకు సంబంధించి 15K టికెట్లు అమ్ముడుపోయాయి. అలాగే ఈ మూవీ ఇప్పటి వరకు 300K డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 2.6 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంకా ఈ సినిమా ప్రీమియర్లకు రెండు రోజులు ఉండగానే.. భారీ వసూళ్లను రాబట్టడంతో ఈ మూవీకి పాజిటివ్ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కూడా కింగ్డమ్ చిత్రం డీసెంట్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు 1 కోటి రూపాయలకుపైగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్ట్ చేసింది. కర్ణాటక, నార్త్ ఇండియాలో కూడా బెటర్‌గా ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూవీకి వాతావారణం సానుకూలంగా ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే విజయ్ దేవరకొండకు ఈ చిత్ర విజయం కీలకంగా మారింది. ఈ చిత్రానికి ముందు వచ్చిన ఫ్యామిలీ స్టార్, ఖుషీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంత మేరకు పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టు కొడితే.. రౌడీ స్టార్ పెద్దోడు అయిపోయే అవకాశం ఉంది. అయితే ఈ మూవీ ఎలాంటి స్పందనను కూడగట్టుకొని ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











