Kingdom Closing Collections Worldwide: కింగ్డమ్ క్లోజింగ్ కలెక్షన్స్..విజయ్ దేవరకొండ మూవీకి లాభమెంత? నష్టమెంత?
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నటించిన చిత్రం కింగ్డమ్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించగా.. సత్యదేవ్ కీలకపాత్ర పోషించారు. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా కింగ్డమ్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వెంకీటేష్ వీపీ, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మనీష్ చౌదరి, బాబురాజ్ తదితరులు కింగ్డమ్‌లో కీలకపాత్రలు పోషించారు.
అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా .. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. ఖుషి, లైగర్, ది ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో వరుస ఫ్లాపులను ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమా చేశారు. టీజర్, ట్రైలర్లతో అంచనాలను పెంచేసిన కింగ్డమ్ విజయ్ దేవరకొండకు హిట్‌ను అందించిందా? ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? అనే వివరాల్లోకి వెళితే..
కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
కింగ్డమ్ చిత్రాన్ని 130 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు పరిశీలిస్తే . నైజాంలో 15 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 15 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
కర్ణాటకలో 3.5 కోట్ల రూపాయలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయల మేర కింగ్డమ్ మూవీ బిజినెస్ చేసింది. దాంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కింగ్డమ్ మూవీకి 54.5 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. విజయ్ దేవరకొండ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 56 కోట్ల రూపాయల షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. భారీ అంచనాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 2850 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

కింగ్డమ్ కలెక్షన్స్
12 రోజుల వరకు కింగ్డమ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. ఇండియా వైడ్‌గా తొలిరోజు 18 కోట్ల రూపాయలు, రెండో రోజు 8 కోట్ల రూపాయలు, 3వ రోజున 8 కోట్ల రూపాయలు, 4వ రోజున 8 కోట్ల రూపాయలు, 5వ రోజున 2 కోట్ల రూపాయలు, 6వ రోజున 2 కోట్ల రూపాయలు, 7వ రోజున 1.50 కోట్ల రూపాయలు, 8వ రోజు 1.50 కోట్ల రూపాయలు, 9వ రోజు కోటి 20 లక్షల రూపాయలు, 10వ రోజున 1.50 కోట్ల రూపాయలు, 11వ రోజున 1.50 కోట్ల రూపాయలు, 12వ రోజు 50 లక్షల రూపాయలు, 13వ రోజున 50 లక్షల రూపాయలను కింగ్డమ్ చిత్రం ఆర్జించింది. దాంతో కలిపి ఇండియా వైడ్‌గా విజయ్ దేవరకొండ మూవీ 13 రోజుల వరకు 64 కోట్ల రూపాయల నెట్.. 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 24 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది కింగ్డమ్. దాంతో కలిపి విజయ్ దేవరకొండ చిత్రం 13 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలిరోజున 12 కోట్ల రూపాయలు, రెండో రోజున 5 కోట్ల రూపాయలు, 3వ రోజున 5 కోట్ల రూపాయలు, 4వ రోజున 5 కోట్ల రూపాయలు, 5వ రోజున కోటి రూపాయలు, 6వ రోజున 80 లక్షల రూపాయలు, 7వ రోజున 65 లక్షల రూపాయలు, 8వ రోజు 1.20 కోట్ల రూపాయలు, 9వ రోజు 75 లక్షల రూపాయలు, 10వ రోజున 82 లక్షల రూపాయలు, 11వ రోజున 85 లక్షల రూపాయలు, 12వ రోజున 30 లక్షల రూపాయలు, 13వ రోజున 40 లక్షల రూపాయలు వసూళ్లు వచ్చాయి. దాంతో కలిపి 13 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ చిత్రానికి 32 కోట్ల రూపాయల షేర్ .. 53 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా కింగ్డమ్ వసూళ్లు చూస్తే.. నైజాంలో 14.50 కోట్ల రూపాయలు, సీడెడ్ 5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2 కోట్ల రూపాయలు, గుంటూరులో 4 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.50 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది. తమిళనాడు + కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 12 కోట్ల రూపాయల షేర్.. 25 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అలాగే ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయల షేర్.. 24 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌ను విజయ్ దేవరకొండ మూవీ రాబట్టింది. దాంతో కలుపుకుని కింగ్డమ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా 52 కోట్ల రూపాయల షేర్ .. 108 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
కింగ్డమ్‌కు లాభమెంత నష్టమెంత?
మిక్స్‌డ్ టాక్ రావడంతో కింగ్డమ్ తన బాక్సాఫీస్ జర్నీని పడుతూ లేస్తూ అన్నట్లుగా సాగించింది. వీకెండ్‌లో ఫర్వాలేదనిపించినా, వీక్‌డేస్‌లో మాత్రం కలెక్షన్స్ కోల్పోయింది విజయ్ దేవరకొండ చిత్రం. హరిహర వీరమల్లు, మహావతార్ నరసింహ సినిమాల నుంచి కింగ్డమ్ చిత్రానికి గట్టి పోటీ ఎదురైంది. అయినప్పటికీ విజయ్ దేవరకొండ ఈ సినిమాను తన భుజాలపై మోశాడు.
తెలుగు రాష్ట్రాల్లో 37 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు గాను .. కింగ్డమ్ చిత్రం కేవలం 32 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ మాత్రమే రాబట్టి 5 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చాడు విజయ్ దేవరకొండ. ఇక వరల్డ్ వైడ్‌గా ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేస్తే 56 కోట్ల రూపాయలకు గాను .. 52 కోట్ల కోట్ల రూపాయల షేర్ రాబట్టి 4 కోట్ల రూపాయలను తీసుకొచ్చింది కింగ్డమ్. మొత్తంగా 13 రోజుల వరకు కింగ్డమ్ చిత్రం 80 శాతం వరకు రికవరీ సాధించింది. నిర్మాతలు ఈ సినిమా కోసం దాదాపు 130 కోట్ల బడ్జెట్‌ను కేటాయించగా.. ఓవరాల్ బడ్జెట్ మీద ఈ సినిమా నిర్మాతలకు దాదాపు 22 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను మిగిల్చింది. అయితే థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాత ఒడ్డునపడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











