Kingdom Box Office Day 1: కింగ్డమ్‌కు రికార్డ్ ఓపెనింగ్స్.. విజయ్ దేవరకొండ మూవీకి ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం కింగ్డమ్. జూలై 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. సత్యదేవ్, వెంకీటేష్ వీపీ, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మనీష్ చౌదరి, బాబురాజ్ తదితరులు కింగ్డమ్ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ కింగ్‌డమ్ మూవీకి సంగీతం అందిస్తుండగా.. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? ఫస్ట్ డే ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..
కింగ్డమ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలు కలిపి కింగ్డమ్ చిత్రానికి 130 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు నిర్మాత సూర్యదేవర నాగవంవీ అధికారికంగా ప్రకటించారు. దాంతో హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలలో ఒకటిగా నిలిచింది కింగ్డమ్. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ విజయ్ దేవరకొండ మార్కెట్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 15 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 15 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇతర రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. కర్ణాటకలో 3.5 కోట్ల రూపాయలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయల మేర కింగ్డమ్ మూవీకి థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. దాంతో వరల్డ్ వైడ్‌గా కింగ్డమ్ మూవీకి 54.5 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితులు విలువ కట్టారు. విజయ్ దేవరకొండ మూవీ లాభాల్లోకి రావాలంటే 56 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని వాల్యూ కట్టారు.
యూఎస్ ప్రీమియర్స్‌లో కింగ్డమ్ రికార్డు
కింగ్‌డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ పరిశీలిస్తే.. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్దిగంటల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్‌లో విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. ముఖ్యంగా అమెరికాలో ప్రీమియర్స్ విషయంలో దుమ్మురేపుతోంది ఈ సినిమా. యూఎస్ ప్రీమియర్స్ మొత్తం 800 షోలకు గాను 4,85, 000 డాలర్లను (భారత కరెన్సీలో 4 కోట్ల రూపాయలు) రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కింగ్డమ్ మూవీకి ఫస్ట్ డే 17 కోట్ల రూపాయలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
కింగ్డమ్ తొలిరోజు కలెక్షన్స్
మార్నింగ్ షో నుంచే పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ కారణంగా కింగ్డమ్ మూవీకి బుకింగ్స్ పెరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ చిత్రానికి తెలుగు వెర్షన్‌లో 63.56 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ చేయగా.. తమిళంలో 13.66 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. తొలి రోజు కింగ్డమ్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల రూపాయలు, తమిళనాడు, కేరళ, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 8 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయల చొప్పున వరల్డ్ వైడ్‌గా 35 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











