Kingdom Day 1 Collections: బాక్సాఫీస్‌పై భారీగా కన్నేసిన విజయ్ దేవరకొండ.. కింగ్టమ్ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
టాలీవుడ్‌లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్, జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంత? తొలి రోజు ఎంత మేర కలెక్ట్ చేయవచ్చనే ట్రేడ్ అంచనాల వివరాల్లోకి వెళితే..
విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీని సుమారుగా 130 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించినట్టు నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా నైజాం హక్కులు 15 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు 6 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 15 కోట్లతో సుమారుగా 36 కోట్ల రూపాయల మేర జరిగింది. కర్ణాటక రైట్స్ 3.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల రూపాయలు మేర జరిగింది. దాంతో వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 54.5 కోట్ల మేర జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 56 కోట్లు షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టైర్ 2 హీరోల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను పరిశీలిస్తే.. ఇటీవల కాలంలో ఏ హీరోకు దక్కని విధంగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా అమెరికాలో 534 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయగా.. ఇప్పటికే 250K డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 2.17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో ఈ వసూళ్లు 500K దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక ఆస్ట్రేలియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్సాన్స్ లభిస్తున్నది. ఈ సినిమాకు సంంధించి మొత్తం 100 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా సమాచారం అందుబాటులో ఉన్న వరకు దాదాపు 1000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 27 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే 15 లక్షల రూపాయల మేర కలెక్షన్లు నమోదు అయ్యాయి.
అలాగే ఆంధ్ర, నైజాంలో మొదలైన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభిస్తున్నది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయల మేర వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు అయ్యాయి. ఇంకా ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దాంతో ఓపెన్సింగ్ కూడా పాజిటివ్‌గానే ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అయితే విజయ్ దేవరకొండకు ఇటీవల కాలంలో పెద్దగా హిట్స్ పడకపోవడంతో ఈ మూవీపై అన్ని వర్గాలు భారీగా అంచనాలు పెట్టుకొన్నారు. ఈ సినిమాకు హిట్ టాక్ పడితే.. సుమారుగా 40 కోట్ల రూపాయల గ్రాస్.. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. 51 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











