Kingdom Day 10 Collection: బాక్సాఫీస్ వద్ద కింగ్డమ్ జోరు.. విజయ్ దేవరకొండ మూవీకి ఎన్ని కోట్లంటే?

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం కింగ్డమ్. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, వెంకీటేష్ వీపీ, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మనీష్ చౌదరి, బాబురాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా .. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. జూలై 31న కింగ్డమ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో కింగ్డమ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? 10వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
కింగ్డమ్‌ను 130 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 15 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 15 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Kingdom Day 10 Expected Box Office Collections Worldwide Vijay Devarakonda Movie get decent numbers in weekend

కర్ణాటకలో 3.5 కోట్ల రూపాయలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయల మేర కింగ్డమ్ మూవీ బిజినెస్ చేసింది. దాంతో కలిపి ప్రపంచవ్యాప్తంగా కింగ్డమ్ మూవీకి 54.5 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 56 కోట్ల రూపాయల షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 2850 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

కింగ్డమ్ 9 రోజుల కలెక్షన్స్
9 రోజుల వరకు కింగ్డమ్‌ కలెక్షన్స్ పరిశీలిస్తే.. ఇండియా వైడ్‌గా తొలిరోజు 18 కోట్ల రూపాయలు, రెండో రోజు 8 కోట్ల రూపాయలు, 3వ రోజున 8 కోట్ల రూపాయలు, 4వ రోజున 8 కోట్ల రూపాయలు, 5వ రోజున 2 కోట్ల రూపాయలు, 6వ రోజున 2 కోట్ల రూపాయలు, 7వ రోజున 1.50 కోట్ల రూపాయలు, 8వ రోజు 1.50 కోట్ల రూపాయలు, 9వ రోజు కోటి 20 లక్షల రూపాయలు ఆర్జించింది. దాంతో కలుపుకుని ఇండియా వైడ్‌గా కింగ్డమ్ చిత్రం 9 రోజుల వరకు 51 కోట్ల రూపాయల నెట్.. 78 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 23 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. దాంతో విజయ్ దేవరకొండ చిత్రానికి 9 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 101 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల వరకు కింగ్డమ్ వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలిరోజున 12 కోట్ల రూపాయలు, రెండో రోజున 5 కోట్ల రూపాయలు, 3వ రోజున 5 కోట్ల రూపాయలు, 4వ రోజున 5 కోట్ల రూపాయలు, 5వ రోజున కోటి రూపాయలు, 6వ రోజున 80 లక్షల రూపాయలు, 7వ రోజున 65 లక్షల రూపాయలు, 8వ రోజు 1.20 కోట్ల రూపాయలు, 9వ రోజు 75 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో 9 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ చిత్రానికి 30 కోట్ల రూపాయల షేర్ .. 49 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా కింగ్డమ్ వసూళ్లు చూస్తే.. నైజాంలో 13.50 కోట్ల రూపాయలు, సీడెడ్ 5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 2 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2 కోట్ల రూపాయలు, గుంటూరులో 3.50 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.50 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది. తమిళనాడు + కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 10 కోట్ల రూపాయల షేర్.. 23 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అలాగే ఓవర్సీస్‌లో 11 కోట్ల రూపాయల షేర్.. 23 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌ను విజయ్ దేవరకొండ మూవీ రాబట్టింది. దాంతో కలుపుకుని కింగ్డమ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా 47 కోట్ల రూపాయల షేర్ .. 102 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

కింగ్డమ్ 10వ రోజు కలెక్షన్స్
వీకెండ్ కావడంతో విజయ్ దేవరకొండ సినిమాకు 10వ రోజు ఉదయం నుంచి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల వరకు 18 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. 10వ రోజు విజయ్ దేవరకొండ చిత్రం తెలుగులో కోటి రూపాయలు.. కర్ణాటక+ తమిళనాడు+ రెస్టాఫ్ ఇండియాలో 30 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 40 లక్షల రూపాయల కలెక్షన్స్ రాబడుతుందని మొత్తంగా శనివారం కింగ్డమ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా 2 కోట్ల రూపాయల గ్రాస్ అందుకుంటుందని భావిస్తున్నారు. దీంతో కలిపి విజయ్ దేవరకొండ మూవీకి వరల్డ్ వైడ్‌గా 104 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X