Kingdom Day 11 Collection: కింగ్డమ్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ మూవీ లాభాల్లోకి రావాలంటే?
లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఫ్లాప్ కావడంతో రేసులో ఈసారి ఖచ్చితంగా నిలబడాలనే కసితో విజయ్ దేవరకొండ చేసిన చిత్రం కింగ్డమ్. జూలై 31న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. జెర్సీతో టాలీవుడ్, బాలీవుడ్‌లలో సత్తా చాటిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు కింగ్డమ్‌ను నిర్మించారు. సత్యదేవ్, వెంకీటేష్ వీపీ, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మనీష్ చౌదరి, బాబురాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా .. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కింగ్డమ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? 11వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..
కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
కింగ్డమ్ చిత్రానికి అన్ని ఖర్చులతో కలిపి 130 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అయ్యింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు పరిశీలిస్తే . నైజాంలో 15 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 15 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
కర్ణాటకలో 3.5 కోట్ల రూపాయలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయల మేర కింగ్డమ్ మూవీ బిజినెస్ చేసింది. దాంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కింగ్డమ్ మూవీకి 54.5 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 56 కోట్ల రూపాయల షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు. భారీ అంచనాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 2850 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

కింగ్డమ్ 10 రోజుల కలెక్షన్స్
9 రోజుల వరకు కింగ్డమ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. ఇండియా వైడ్‌గా తొలిరోజు 18 కోట్ల రూపాయలు, రెండో రోజు 8 కోట్ల రూపాయలు, 3వ రోజున 8 కోట్ల రూపాయలు, 4వ రోజున 8 కోట్ల రూపాయలు, 5వ రోజున 2 కోట్ల రూపాయలు, 6వ రోజున 2 కోట్ల రూపాయలు, 7వ రోజున 1.50 కోట్ల రూపాయలు, 8వ రోజు 1.50 కోట్ల రూపాయలు, 9వ రోజు కోటి 20 లక్షల రూపాయలు, 10వ రోజున 1.50 కోట్ల రూపాయలను కింగ్డమ్ చిత్రం ఆర్జించింది. దాంతో కలిపి ఇండియా వైడ్‌గా కింగ్డమ్ చిత్రం 10 రోజుల వరకు 52 కోట్ల రూపాయల నెట్.. 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 24 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి కోవిడ్ తర్వాత ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన విజయ్ దేవరకొండ మూవీగా నిలిచింది. ఇప్పటి వరకు 20 కోట్ల కలెక్షన్స్‌తో ఈ రికార్డు ఖుషి చిత్రం పేరిట ఉండేది. ఓవర్సీస్ వసూళ్లతో కలిపి కింగ్డమ్ మూవీకి 10 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల వరకు కింగ్డమ్ వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలిరోజున 12 కోట్ల రూపాయలు, రెండో రోజున 5 కోట్ల రూపాయలు, 3వ రోజున 5 కోట్ల రూపాయలు, 4వ రోజున 5 కోట్ల రూపాయలు, 5వ రోజున కోటి రూపాయలు, 6వ రోజున 80 లక్షల రూపాయలు, 7వ రోజున 65 లక్షల రూపాయలు, 8వ రోజు 1.20 కోట్ల రూపాయలు, 9వ రోజు 75 లక్షల రూపాయలు, 10వ రోజున 82 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో కలిపి 10 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ చిత్రానికి 31 కోట్ల రూపాయల షేర్ .. 50 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా కింగ్డమ్ వసూళ్లు చూస్తే.. నైజాంలో 14 కోట్ల రూపాయలు, సీడెడ్ 5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 2.50 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2 కోట్ల రూపాయలు, గుంటూరులో 3.50 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3.50 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది. తమిళనాడు + కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 11 కోట్ల రూపాయల షేర్.. 24 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అలాగే ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయల షేర్.. 24 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌ను విజయ్ దేవరకొండ మూవీ రాబట్టింది. దాంతో కలుపుకుని కింగ్డమ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా 48 కోట్ల రూపాయల షేర్ .. 105 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
కింగ్డమ్ 11వ రోజు కలెక్షన్స్
ఆదివారం కావడంతో కింగ్డమ్ మూవీకి బాగానే బుకింగ్స్ జరుగుతున్నట్లుగా నివేదికలు వస్తున్నాయి. 11వ రోజు సాయంత్రం 5 గంటల వరకు 15 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీని ఈ సినిమా అందుకున్నట్లు సాక్‌నిక్ తెలిపింది. ఆదివారం విజయ్ దేవరకొండ మూవీ ప్రపంచవ్యాప్తంగా కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో కలిపి కింగ్డమ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 106 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 9 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











